Couple Life : ఈ ఆహారాల‌ను తీసుకుంటే అంతే.. శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది జాగ్ర‌త్త‌..!

Couple Life : నిత్యం మ‌నం పాటించే ఆహారపు అల‌వాట్ల వ‌ల్లే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతాం. శ‌రీరానికి చేటు చేసే ఆహారాల‌ను తింటే.. అనేక విధాలుగా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక రోజూ అన్ని పోష‌కాలు కలిగిన పోష‌కాహారాల‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌నే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Couple Life taking these foods lower srungaram power

1. శీత‌ల పానీయాలు (కూల్ డ్రింక్స్)ను ఎక్కువ‌గా తాగేవారిలో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది. ఇవి సెరొటోనిన్ అనే హార్మోన్‌పై ప్ర‌భావం చూపిస్తాయి. ఇది హ్యాప్పీ హార్మోన్‌. అంటే మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుతుంది. ఈ హార్మోన్ త‌గ్గితే శృంగారంపై ఆస‌క్తిని చూపించ‌రు. ఆ సామ‌ర్థ్యం కూడా త‌గ్గిపోతుంది. క‌నుక శీత‌ల పానీయాల‌ను తాగ‌డం మానేయాలి.

2. మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం వ‌ల్ల కూడా శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది. దీని వ‌ల్ల హార్మోన్లపై ప్ర‌భావం ప‌డుతుంది. యాక్టివ్‌గా ఉండ‌లేరు. ఉత్సాహం త‌గ్గిపోతుంది. ఇది శృంగార జీవితంపై ప్ర‌భావం చూపిస్తుంది. క‌నుక మ‌ద్యం సేవించ‌డం మానేయాల్సి ఉంటుంది.

3. మ‌న శ‌రీర ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌, శృంగార సామ‌ర్థ్యానికి జింక్ ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతుంది. అయితే ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జింక్ లోపిస్తుంది. దీంతో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది. బ‌య‌ట మ‌న‌కు ప్యాకెట్ల‌లో ల‌భించేవన్నీ ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలే. వీటిని ఎంత త‌క్కువ‌గా తీసుకుంటే అంత మంచిది. స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే ఆహారాల‌నే మ‌నం తీసుకోవాల్సి ఉంటుంది.

4. నూనె ప‌దార్థాలు, జంక్ ఫుడ్‌, ఇత‌ర ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శ‌రీరానికి హాని క‌లిగిస్తాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా త‌గ్గిపోతుంది. దీని వ‌ల్ల జ‌న‌నావ‌య‌వాలపై ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గుతుంది. క‌నుక ఆయా ఆహారాల‌ను తిన‌డం తగ్గించాలి. లేదా మానేయాలి.

5. చ‌క్కెర ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల కూడా శృంగారంపై ఆస‌క్తి త‌గ్గిపోతుంది. అలాగే తీపి ప‌దార్థాల‌ను తిన‌డం మానేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని త‌గ్గించాలి. దీని వ‌ల్ల కూడా శృంగార శ‌క్తి త‌గ్గుతుంది. క‌నుక ప్లాస్టిక్ బాటిల్స్‌ను, పాత్ర‌ల‌ను వాడ‌రాదు.

ఈ విధ‌మైన జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం ద్వారా ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. దీంతో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది.

Editor

Recent Posts