Health Tips : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నువ్వులను ఉపయోగిస్తున్నారు. వీటిని అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. నువ్వులతో తయారు చేసే ఏ వంటకం అయినా సరే రుచిగానే ఉంటుంది. ప్రధానంగా వీటితో తీపి వంటకాలను తయారు చేస్తుంటారు.
నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసే లడ్డూలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే.. నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డూను రోజుకు ఒక్కటి తింటే చాలు.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక్క నువ్వుల లడ్డూను తినడం వల్ల మనకు 62 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందువల్ల వీటిని తింటే బరువు పెరుగుతామన్న భయం చెందాల్సిన పనిలేదు. పైగా ఈ లడ్డూను తినడం వల్ల శక్తి లభిస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. చిన్నారులకు పెడితే వారు చదువుల్లో రాణిస్తారు.
2. నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసిన లడ్డూను రోజుకు ఒకటి తింటే చాలు, గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. గుండె సురక్షితంగా ఉంటుంది.
3. నువ్వుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైటో స్టెరాల్స్ అనే సమ్మేళనాలు నువ్వుల్లో అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను గణనీయంగా తగ్గిస్తాయి. అందువల్ల రోజూ నువ్వుల లడ్డూ ఒకటి తింటే చాలు.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
4. నువ్వులు, బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, సెలీనియం, కాపర్, జింక్, ఐరన్, విటమిన్ బి6, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లపై శరీరం పోరాడుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
5. నువ్వులు, బెల్లంలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వుల్లో ఉండే మెగ్నిషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో గ్లూకోజ్ లెవల్స్ తగ్గడమే కాక.. హైబీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి నువ్వుల లడ్డూలు ఎంతో మేలు చేస్తాయి.
6. కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ సమస్యలు ఉన్నవారు రోజూ నువ్వుల లడ్డూను తింటుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నువ్వుల్లో ఉండే టైరోసిన్ అనే సమ్మేళనం శరీరంలో సెరొటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
7. మలబద్దకం సమస్య ఉన్నవారు రోజూ ఒక్క నువ్వుల లడ్డూను తింటే ప్రయోజనం ఉంటుంది. రోజూ సుఖ విరేచనం అవుతుంది.
8. నువ్వుల లడ్డూను తీసుకోవడం వల్ల చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు సమస్యలు తగ్గుతాయి. చర్మంలో తేమ పెరిగి పొడిదనం తగ్గుతుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. చర్మంపై ఉండే మచ్చలు పోతాయి.