ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం. అందువల్ల ఏ పని చేద్దామన్నా క్షణం తీరిక లభించడం లేదు. ఇక దంపతులు అయితే చాలా వరకు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో పని ఒత్తిడి వల్ల తీవ్రంగా అలసిపోయి శృంగారంలో పాల్గొనడం లేదు. వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు అయినా శృంగారంలో పాల్గొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మందికి శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతోంది. కారణాలేమున్నా చాలా మంది దంపతులు కుదిరితే ఎప్పుడో శృంగారంలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల ఆయిల్స్‌ను వాడితే శృంగారంలో రెచ్చిపోతారు. ఆ కార్యంలో ఎంతో చురుగ్గా పాల్గొంటారు. ఇక ఆ ఆయిల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు మార్కెట్‌లో అనేక రకాల ఆయిల్స్ లభిస్తున్నాయి. వాటిల్లో ఫెన్నెల్ ఆయిల్ కూడా ఒకటి. ఇది ఎసెన్షియల్ ఆయిల్‌లాగా మనకు లభిస్తుంది. దీన్ని వాడితే స్త్రీ, పురుషులు ఇరువురిలోనూ శృంగార కాంక్ష, సామర్థ్యం పెరుగుతాయి. దీంతో పడకగదిలో రెచ్చిపోతారు. అలాగే శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో జాస్మిల్ ఆయిల్ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. దంపతులు ఈ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది జననావయవాలకు రక్త సరఫరాను పెంచి శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది.
ఇక రోజ్ ఆయిల్, నెరోలి ఆయిల్, క్లారీ సేజ్ ఆయిల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మనకు మార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటిని వాడినా కూడా శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆ కార్యం పట్ల ఆసక్తి కలుగుతుంది. దీంతో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.