చాలా మంది ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీ తాగుతుంటారు. ఇక కొందరు నీళ్లతో తమ దిన చర్యను ప్రారంభిస్తారు. అయితే వాస్తవానికి ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకులను తినాలని ఆయుర్వేదం చెబుతోంది. ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఖాళీ కడుపుతో నాలుగైద కరివేపాకులను అలాగే నమిలి మింగాలని వారు సూచిస్తున్నారు. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకుల్లో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తింటే కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు రోజూ ఈ ఆకులను తింటే ఎంతగానో మేలు జరుగుతుంది. ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే వయస్సు మీద పడిన తరువాత కళ్లలో శుక్లాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక డయాబెటిస్ ఉన్నవారికి కరివేపాకులు ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
కరివేపాకులను ఉదయం పరగడుపునే తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులను ఖాళీ కడుపుతో తినడం వల్ల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కనుక ఇకపై రోజూ మీరు ఖాళీ కడుపుతో కరివేపాకులను తినండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.