హెల్త్ టిప్స్

Curry Leaves : రోజూ ఖాళీ క‌డుపుతో 4 క‌రివేపాకుల‌ను న‌మిలి తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Curry Leaves : కరివేపాకుని ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. ఇంచుమించు మనం అన్ని రకాల వంటల్లో కరివేపాకుని వాడుతూ ఉంటాము. కానీ, కరివేపాకుని తినడానికి కొంతమంది ఇష్టపడక కూరల్లో వాటిల్లో కూడా ఏరి పక్కన పెడుతూ ఉంటారు. కరివేపాకు వలన కలిగే లాభాలను కనుక మీరు చూసినట్లయితే, ఇక మీదట ఆ తప్పు చేయరు. కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కరివేపాకుని తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

జీర్ణశక్తిని పెంచడానికి, కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. అలానే, చెడు కొలెస్ట్రాల్ని కూడా ఇది తొలగిస్తుంది. కరివేపాకుని తీసుకుంటే, జీర్ణశక్తిని పెంచి బరువు కూడా తగ్గొచ్చు. ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగలో, అర స్పూన్ కరివేపాకు పేస్ట్ వేసి తాగితే, బరువు తగ్గడానికి అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా కరివేపాకులలో ఎక్కువ ఉంటాయి. కరివేపాకును తీసుకుంటే, యూరిన్ సమస్యలు ఉండవు. అలానే బ్లాడర్ సమస్యల నుండి కూడా బయటపడొచ్చు.

curry leaves on empty stomach many wonderful health benefits

కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ లో, కొంచెం మీరు దాల్చిన పొడి వేసుకొని తీసుకున్నట్లయితే, యూరినరీ సమస్యల నుండి ఈజీగా బయటపడొచ్చు. ఈరోజుల్లో చాలామంది కామన్ గా షుగర్ తో బాధపడుతున్నారు. కరివేపాకు లో యాంటీ హైపర్ గ్లైసమిక్ సహజంగా ఉండడం వలన, రక్తనాళాలలో గ్లూకోస్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి, షుగర్ ఉన్నవాళ్లు ప్రతిరోజూ ఉదయం పూట నాలుగు కరివేపాకులను తీసుకుంటే, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలు మార్నింగ్ సిక్నెస్, వాంతులు, వికారంతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఉపశమనం కోసం, కరివేపాకు తీసుకుంటే ఫలితం ఉంటుంది. కరివేపాకులో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. కరివేపాకుని రెగ్యులర్ గా డైట్ లో తీసుకుంటే, కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. చూసారు కదా కరివేపాకు వలన లాభాలు. ఇక మీదట కరివేపాకు ని రెగ్యులర్ గా తీసుకొని ఈ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి.

Admin

Recent Posts