పోష‌కాహారం

White Radish : బీపీ, గుండె జ‌బ్బులు ఉన్న‌వాళ్ల‌కు వ‌రం.. ముల్లంగి..!

White Radish : ఆరోగ్యానికి ముల్లంగి ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగిని తీసుకోవడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. తెల్ల ముల్లంగిని మనం అనేక రకాల వంటకాలని తయారు చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. ముల్లంగిలో ఫాస్ఫరస్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముల్లంగిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.

క్యారెట్లు, క్యాబేజీ, ముల్లంగి ఇవన్నీ కూడా ఆకలిని పుట్టిస్తాయి. నిజానికి మనకి దొరికే కూరగాయలని మనం తీసుకోవడం వలన పోషకాలు బాగా అందుతాయి. తెల్ల ముల్లంగి తీసుకోవడం వలన రక్తపోటు తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ముల్లంగిని తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా ముల్లంగితో పెంచుకోవచ్చు.

radish is very beneficial for bp and heart patients

ముల్లంగిని తీసుకోవడం వలన ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు ఉంటాయి. ముల్లంగి గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ముల్లంగిని మనం సలాడ్ వంటి వాటిలో కూడా వేసుకుని తీసుకోవచ్చు. ముల్లంగిలో ఫ్లేవనాయిడ్స్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలని నిర్వహించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ముల్లంగి సహాయం చేస్తుంది.

ముల్లంగిలో కొల్లాజెన్ అనే పోషక ప‌దార్థం ఉంటుంది. రక్తనాళాలని బలోపేతం చేయడానికి ఇది సహాయం చేస్తుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ముల్లంగిని తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా ఉండవు. ముల్లంగితో ఎసిడిటీ సమస్యకి కూడా చెక్ పెట్టొచ్చు. ఎసిడిటీ, ఉబకాయం, గ్యాస్టిక్ సమస్యలు వంటివి ముల్లంగితో తొలగిపోతాయి. వికారం వంటి సమస్యలు కూడా ఉండవు. చాలామంది ఈ రోజుల్లో ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు, ఈ సమస్యని తొలగించడానికి ముల్లంగి బాగా హెల్ప్ చేస్తుంది. బీపీ, గుండె జబ్బులు ఉన్నవాళ్లు ముల్లంగి తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది.

Admin

Recent Posts