హెల్త్ టిప్స్

Anemia : ర‌క్తం ఎక్కించిన‌ట్లుగా ఒంట్లో ర‌క్తం ప‌డుతుంది..!

Anemia : సాధారణంగా మన శరీరంలో సరైన హిమోగ్లోబిన్ శాతం లేకపోతే శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్య నుంచి విముక్తి పొందడానికి దుంప జాతికి చెందిన బీట్ రూట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.తరచూ మన ఆహారంలో భాగంగా బీట్ రూట్ తినటం వల్ల కేవలం రక్తహీనత సమస్యకు మాత్రమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి బీట్ రూట్ తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

ముఖ్యంగా తలసేమియా, రక్తహీనత సమస్యతో బాధపడే వారికి సరైన మోతాదులో ఐరన్ అవసరం అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తం మెరుగుపడుతుంది. ఈ క్రమంలోనే ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

daily one glass of this juice can cure anemia

అదే విధంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరిగి పోయి అధిక శరీర బరువు పెరిగిన వారికి కూడా ఈ జ్యూస్ ఎంతో ప్రయోజనకరం. ప్రతి రోజు ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది.కేవలం జ్యూస్ రూపంలో మాత్రమే కాకుండా వివిధ రకాలుగా బీట్ రూట్ తినడం వల్ల కాలేయ సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా బీట్ రూట్ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా దూరమవుతాయి.

Admin

Recent Posts