Left Side Sleeping : శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం నిత్యం వ్యాయామం చేయడం, వేళకు తగిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగిన మోతాదులో నిద్ర కూడా మనకు అంతే అవసరం. నిద్ర వల్ల మన ఆరోగ్యం మెరుగు పడడమే కాదు, శరీరానికి నిత్యం కొత్త శక్తి వస్తుంది. రోజూ పునరుత్తేజం పొందుతాం. దీంతోపాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అయితే నిద్రించే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు. కొందరు వెల్లకిలా, మరికొందరు బోర్లా, ఇంకొందరు కుడికి, మరికొందరు ఎడమకు.. ఇలా రకరకాల వైపులకు తిరిగి పడుకుంటారు. కానీ ఎవరైనా ఎడమ వైపుకు తిరిగి పడుకుంటేనే మంచిదట. దీని వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలపై డాక్టర్ జోహన్ డుయిలర్డ్ అనే వైద్యుడు పరిశోధనలు చేశారు. దీని ప్రకారం తెలిసిందేమిటంటే ఎడమ వైపుకి తిరిగి నిద్రిస్తే నిజంగానే ఆశ్చర్యకర ఫలితాలు కనిపిస్తాయట. ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కుడి వైపు తిరిగి నిద్రిస్తే అది శరీరంపై నెగటివ్ ఎఫెక్ట్‌ను చూపిస్తుంది. ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల గుండె పై భాగంలో ఉండే లింఫ్ నోడ్‌ల వ్యవస్థ శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ఇదంగా చాలా సహజ సిద్ధమైన పద్ధతిలో జరుగుతుంది.
చిత్రంలో చూశారుగా. కుడి పక్కకు తిరిగి పడుకుంటే అది జీర్ణవ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో. అదే ఎడమ వైపు తిరిగి ఉంటే జీర్ణ ఆమ్లాలు సరిగ్గా పనిచేస్తాయి. దీంతో లింఫ్ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుంది. ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. మన శరీరంలో ఉండే లింఫ్ వ్యవస్థలో ప్లీహం చాలా ముఖ్యమైన అవయవం. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల ప్లీహం కూడా సమర్థవంతంగా తన విధులు నిర్వర్తిస్తుంది. ఇలా ఎడమవైపుకు తిరిగి నిద్రించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఆ వైపునే ఎవరైనా నిద్రించాల్సి ఉంటుంది.