Date Seeds : మనం ఖర్జూరాలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఖర్జూరాలు చాలా తియ్యగా, రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియని విషయమేంటంటే ఖర్జూరాలలో ఉండే గింజలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మనం సాధారణంగా ఖర్జూర పండ్లను తిని వాటి గింజలను పడేస్తూ ఉంటాము. కేవలం ఖర్జూర పండ్లే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తాము. కానీ ఖర్జూర పండ్ల గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలె మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం, క్యాల్షియం, కాడ్మియం వంటి పోషకాలు ఉంటాయి.
ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఖర్జూర పండ్ల గింజలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..వీటిని ఎలా తీసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్జూర పండ్ల గింజలను తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం మరియు జుట్టు సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారు ఈ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఖర్జూర గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ కారణంగా డిఎన్ఎ దెబ్బతినకుండా చేయడంలో సహాయపడతాయి. అలాగే ఈ గింజలను వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
డయాబెటిస్ తో బాధపడే వారు ఈ గింజలను వాడడం వల్ల డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ గింజలను వాడడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. పొట్టలో ఉండే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. విరోచనాల సమస్యతో బాధపడే వారు ఈ గింజలను వాడడం వల్ల విరోచనాల సమస్య నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది. ఈ ఖర్జూర గింజలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గింజలను మనం పొడిగా చేసి తీసుకోవాలి. ఖర్జూర గింజలను వేయించి పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని జ్యూస్ లలో, స్యూతీలలో, కాఫీ, టీ లలో వేసుకుని తీసుకోవచ్చు. ఈ విధంగా ఖర్జూర పండ్ల గింజలను పొడిగా చేసి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.