Bendakaya Vankaya Karam Pulusu : బెండ‌కాయ‌లు, వంకాయ‌ల‌ను క‌లిపి ఇలా కారం పులుసు చేయండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

Bendakaya Vankaya Karam Pulusu : బెండ‌కాయ వంకాయ కారం పులుసు.. బెండ‌కాయ‌లు, వంకాయ‌లు క‌లిపి చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా ఈ పులుసును త‌యారు చేసేవారు. బెండ‌కాయ‌లు, వంకాయ‌ల‌తో త‌ర‌చూ ఒకేరకం వంట‌కాలు కాకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ బెండ‌కాయ వంకాయ కారం పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ వంకాయ కారం పులుసు తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, త‌రిగిన బెండ‌కాయ‌లు – 12, త‌రిగిన వంకాయ‌లు – 4, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాటా – 1, కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు లీట‌ర్, ఇంగువ – పావు టీ స్పూన్, బెల్లం తురుము – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Bendakaya Vankaya Karam Pulusu recipe in telugu
Bendakaya Vankaya Karam Pulusu

బెండ‌కాయ వంకాయ కారం పులుసు తయారీ విధానం..

ముందుగా క‌ళాయిలో 2 టీ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. త‌రరువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత వంకాయ ముక్క‌లు వేసి స‌గానికి పైగా వేయించాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను ప్లేట్ లోకి తీసుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ప‌సుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

యూట్యూబ్‌లో మ‌మ్మ‌ల్ని స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి..!

త‌రువాత ట‌మాట ముక్క‌లు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని కూడా ప‌చ్చి వాసన పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత బెల్లం, ఇంగువ‌, కొత్తిమీర వేసి మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత వేయించిన వంకాయ‌, బెండ‌కాయ ముక్క‌లు వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు మ‌రిగించాలి. ముక్క‌లు మెత్త‌గా ఉడికి పులుసు ద‌గ్గ‌ర ప‌డ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ వంకాయ పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts