Diabetes : మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. షుగర్ వ్యాధి అనేది ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక వ్యాధి. దీని వల్ల అతి మూత్రం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించడం, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్దకం దీని ముఖ్య లక్షణాలు. షుగర్ వ్యాధిని సాధారణంగా రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ, ఆహారనియమాలను పాటించడం వల్ల ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు ఏది పడితే అది తినకూడదు.
షుగర్ వ్యాధి గ్రస్తులు తినకూడని 10 ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధి గ్రస్తులు తినకూడని ముఖ్యమైన ఆహార పదార్థాల్లో వైట్ బ్రెడ్ ఒకటి. ఈ వైట్ బ్రెడ్ ను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ అమితంగా ఇష్టపడతారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండడంతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా అధిక శాతంలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ బ్రెడ్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. కనుక వైట్ బ్రెడ్ ను షుగర్ వ్యాధి గ్రస్తులు పూర్తిగా దూరం పెట్టాలి. ఒక మధుమేహాన్ని పెంచే మరో పదార్థం పాలు. పాలతో పాటు కొవ్వును కలిగి ఉన్న పాల ఉత్పత్తులన్నీ షుగర్ వ్యాధి గ్రస్తులకు ప్రమాదకరమైన వాటిగా నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే కొవ్వు పదార్థాలు షుగర్ వ్యాధి గ్రస్తులకు అధికంగా హానిని కలిగిస్తాయి. కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం. డయాబెటిస్ ఉన్న వారు తినకూడని మరో పదార్థం తెల్లన్నం.
ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహాన్ని పెంచే మరో ఆహార పదార్థం బంగాళాదుంప. ఇది ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి షుగర్ వ్యాధి పెరుగుతుంది. కాబట్టి వీటిని షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే ఫ్రూట్ జ్యూస్ ను అధికంగా తాగే వారు త్వరితగతిన షురగ్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల 18 శాతం డయాబెటిస్ బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఎండుద్రాక్ష ఒకటి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి.
వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ ఎండుద్రాక్ష మధుమేహ వ్యాధి గ్రస్తులకు హానికరం. కనుక వీటిని షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోకపోవడమే ఉత్తమం. షుగర్ వ్యాధి గ్రస్తులకు హాని చేసే మరో పదార్థం ఫ్రెంచ్ ఫ్రైస్. దీనిని తయారు చేయడానికి వాడిన పదార్థాల వల్ల, నూనెల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరడంతో పాటు చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సాప్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు హాని కలుగుతుంది. ఇవి తాగిన వారు అధిక బరువు బారిన పడడమే కాకుండా షుగర్య వ్యాధి బారిన కూడా త్వరగా పడతారని వీటిని తాగకపోవడమే ఉత్తమం అని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ తీసుకోవడం షుగర్ వ్యాధి గ్రస్తులకు అంత మంచిది కాదు.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి. వీటిని ఉపయోగించడానికి బదులు మామూలు చక్కెరలను ఉపయోగించడం ఉత్తమం. అదే విధంగా చాలా మంది ఇష్టంగా తినే మటన్ వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు దీనికి బదులుగా చికెన్, ఫిష్ వంటి వాటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ రావడానికి ఎక్కువగా ఆహార పదార్థాలే కారణమవుతున్నాయి. కాబట్టి కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉండి షుగర్ వ్యాధిని పెంచే వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. సహజ సిద్దమైన మందులను ఉపయోగిస్తూ తగిన ఆహారాన్ని తీసుకుంటూ షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.