Oil : ఈ నూనెను వాడితే ఎంత‌టి కొవ్వు అయినా స‌రే ఇట్టే క‌రిగిపోతుంది..!

Oil : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలలో కొవ్వు కూడా ఒక‌టి. మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రు కూడా శ‌రీరంలో కొవ్వును క‌లిగి ఉంటారు. అయితే ఈ కొవ్వు ఎక్కువైన‌ప్పుడు అనేక ఇబ్బందులు, స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. శ‌రీరంలో కొవ్వు అధికంగా చేర‌డం వ‌ల్ల గుండెపోటు, ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సిన వ‌స్తుంది. శ‌రీరంలో ప్ర‌తి భాగంలో కొవ్వు ఉన్న‌ప్ప‌టికి అధికంగా కొవ్వు చేరే భాగాలు కూడా కొన్ని ఉన్నాయి. న‌డుము చుట్టూ చేరిన కొవ్వు వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ప్ర‌స్తుత కాలంలో పొట్ట త‌గ్గ‌డం అనేది ఎంతో క‌ష్టంతో కూడుకున్న ప‌ని. అవి ఇవి తిన‌కుండా పొట్ట మాడ్చుకోలేము.

పొట్ట త‌రువాత అధికంగా కొవ్వు చేరే భాగాలు పిరుదులు. ఈ భాగాల్లో కొవ్వు చేర‌డం వల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో పాటు అందవిహీనంగా క‌న‌బ‌డ‌తాం. లావుగా మారిన విష‌యం ఈ భాగాల్లో చేరిన కొవ్వును చూస్తేనే తెలుస్తుంది. మారుతున్న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అలా అని గంట కొద్ది వ్యాయామం చేసే స‌మ‌యం కూడా ఈ రోజుల్లో ఎవ‌రికి లేదు. అయితే ఈ కొవ్వును కొన్ని ర‌కాల చిట్కాల‌ను ఉప‌యోగించి తొల‌గించుకోవ‌చ్చు. ఇంట్లో త‌యారు చేసుకున్న నూనెను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు.

use this oil to reduce fat in body very effective method use this oil to reduce fat in body very effective method
Oil

ఈ నూనెను ఉప‌యోగించ‌డం వ‌ల్ల పొట్ట చుట్టూ చేరిన కొవ్వు త‌గ్గ‌డంతో పాటు వ‌దులుగా ఉన్న పొట్ట గ‌ట్టిగా అవుతుంది. కొవ్వును క‌రిగించే ఈ నూనెను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. ఈ నూనెను ఎలా వాడాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి గానూ 100 గ్రా. ఆవ నూనెను, 50 గ్రా. ల క‌ర్పూరాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఆవ‌నూనెను చిన్న మంట‌పై వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి అందులో క‌ర్పూరాన్ని వేయాలి. క‌ర్పూరం పూర్తిగా క‌రిగి నూనె చ‌ల్లారిన త‌రువాత దానిని సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న నూనెను త‌గిన మోతాదులో తీసుకుని కొవ్వు చేరిన చోట రాసి మ‌ర్ద‌నా చేయాలి. ఈ నూనెను వాడిన ప్ర‌తిసారీ అది గోరు వెచ్చ‌గా ఉండేలా చూసుకోవాలి. కొవ్వు చేరిన చోట నూనె రాసి చేత్తో కుడి నుండి ఎడ‌మ‌కు, ఎడ‌మ నుండి కుడికి తిప్పుతూ 15 నిమిషాల పాటు బాగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా మ‌ర్ద‌నా చేసుకున్న 45 నిమిషాల త‌రువాత వేడి నీటితో స్నానం చేయాలి. ఈ చిట్కాను వాడిన మూడు రోజుల్లోనే మ‌న శ‌రీరంలో మార్పు రావ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

D

Recent Posts