హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఇలా చేస్తే హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీస్ రోగుల రక్తనాళాలు గట్టిపడతాయి&period; నాళాలలో గడ్డలు ఏర్పడతాయి&period; వీరి రక్తంలోని కొన్ని పదార్ధాలు విభిన్నంగా వుండి ఎల్లపుడూ గడ్డ కట్టేందుకు రెడీగా వుంటుంది&period; గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలలో గడ్డలు ఏర్పడితే&comma; గుండెకు రక్తం అందక గుండెపోటు వచ్చే అవకాశం వుంది&period; కుటుంబం సభ్యులలో గుండె జబ్బు చరిత్ర వుంటే డయాబెటీస్ రోగులకు గుండె జబ్బు తప్పక వస్తుంది&period; అది కూడా కుటుంబ సభ్యులు పురుషులు 55 సంవత్సరాల లోపు&comma; మహిళలు 65 సంవత్సరాల లోపు గుండెజబ్బు కలిగి మరణించివుంటే వీరికి మరింత చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెంట్రల్ ఒబేసిటీ అంటే నడుము చుట్టూ కొవ్వు పేరుకుంటే అంటే పిరుదుల భాగం కాకుండా నడుము పురుషులలో 40 అంగుళాల పైన&comma; స్త్రీలలో 35 అంగుళాల పైన వుంటే దీనిని సెంట్రల్ ఒబేసిటీ అంటారు&period; ఈ అధిక పొట్ట కొవ్వు చెడు కొల్లెస్టరాల్ కలిగించి రక్తనాళాలలో గడ్డలు పెంచి అడ్డుపడుతూంటుంది&period; ఆ సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం వుంది&period; రక్తనాళాలలో లో డెన్సిటీ లిపోప్రొటీన్ అంటే చెడు కొల్లెస్టరాల్ అధిక సాంద్రత కలిగి వుండి గుండెకు రక్తం చేర్చే రక్తనాళాలలో అడ్డంకులేర్పరచడం&comma; ట్రిగ్లీసెరైడ్స్ అధికమై రక్తాన్ని మరింత చిక్కబరచటం కూడా కారణాలుగా వుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87757 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diabetes-1-1&period;jpg" alt&equals;"diabetes persons follow these tips to prevent heart stroke " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక డయాబెటిక్ రోగులలో ట్రిగ్లీసెరైడ్స్&comma; లిపోప్రొటీన్లు తక్కువగా వుండాలి&period; డయాబెటిక్ రోగులలో అధిక రక్తపోటు వుంటే గుండె పోటు వచ్చే అవకాశాలు అధికంగా వుంటాయి&period; డయాబెటిక్ రోగికి పొగతాగే అలవాటు వుంటే అది రక్తనాళాలపై డయాబెటీస్ ప్రభావాన్ని అధికం చేస్తుంది&period; కన్ను&comma; కిడ్నీ మొదలైన సమస్యలు కూడా కలిగిస్తుంది&period; అవయవాలు తీసివేసే పరిస్ధితికూడా వస్తుంది&period; కనుక డయాబెటిక్ రోగులు పొగతాగరాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts