హెల్త్ టిప్స్

షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు తినొచ్చు, నిజం…!

ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేస్తూ ఉంటారు మన దేశంలో షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు తినకూడదు అని చెప్పగానే నమ్మేసి నోరు కట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. కాని వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ లు తాగకూడదు అంతే గాని, పండ్ల రసాలు తీసుకోవద్దు అనేది ఏమీ లేదు. వాళ్ళు రోజుకు 100 నుంచి 400 గ్రాముల వరకు నేరుగా పండ్లు తినవచ్చని చెప్తున్నారు వైద్యులు. అయితే ఏవి పడితే అవి తినకూడదు.

ఎంత పడితే అంత అసలు తినకూడదు గాని ధైర్యంగా తినవచ్చు. యాపిల్‌, నారింజ, బొప్పాయి, దానిమ్మ, జామ, సపోటా, సీతాఫలం, పుచ్చకాయ, పైనాపిల్‌ పండ్లను లిమిట్ లో తింటే చాలు. షుగర్ ఉన్న వాళ్ళతో పాటుగా స్థూలకాయులు, గుండె రక్తనాళాల జబ్బులు ఉన్నవారు కూడా ధైర్యంగా పళ్ళు తినవచ్చు. ఆహారంలో పండ్లు లేకపోతే విటమిన్లు శరీరానికి అందే అవకాశం ఉండదు.

diabetics can eat fruits say experts

రక్తంలో ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారు పండ్లు తినోద్దని చెప్తున్నారు. ఇలాంటి వారు రోజుకు 25 నుంచి 40 గ్రాముల పీచు పదార్థం తప్పనిసరిగా తినాలని వైద్యులు చెప్తున్నారు. కూరగాయలు, కాయధాన్యాలు, చిక్కుడు ధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని రోజు తింటే మంచిది. పీచుపదార్థాలు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా గ్లూకోజ్‌ అరుగుదల వేగాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.

Admin

Recent Posts