హెల్త్ టిప్స్

White Spots On Banana : అరటి పండ్లు కొనేటప్పుడు ఈ తప్పు అస్సలు చెయ్యద్దు.. ఇది ఎంత ప్రమాదమో తెలుసా..?

White Spots On Banana : అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్ని సీజన్స్ లో కూడా, అరటి పండ్లు మనకి దొరుకుతాయి. అరటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన, చక్కటి ప్రయోజనం ఉంటుంది. అరటిపండ్లలో పొటాషియంతో పాటుగా, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అరటి పండ్లను తీసుకుంటే, జీర్ణ క్రియని మెరుగుపరచుకోవచ్చు. గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అరటి పండ్లు తీసుకుంటే, బరువు కూడా తగ్గొచ్చు. అరటిపండ్లలో ఉండే పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎంతో మేలు చేస్తాయి.

అరటి పండ్లు తినేటప్పుడు, ఈ తప్పుని అసలు చేయకూడదు. ఇటువంటి అరటి పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. చిన్న తెల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు తీసుకుంటే, ఆరోగ్యానికి హాని కలుగుతుంది. తెల్లటి మచ్చలు ఉన్న అరటి పండ్లు తీసుకోవడం వలన అందులో కీటకాలు ఉండవచ్చు. కాబట్టి, ఎప్పుడూ కూడా అరటి పండ్లు కొనేటప్పుడు ఈ విషయాన్ని గమనించి, అప్పుడు కొనుక్కోవడం మంచిది.

do not make any mistakes while buying banana

ఒక వ్యక్తి తన సోషల్ మీడియాలో అరటిపండు మీద తెల్లని మచ్చలు గురించి వివరించడం జరిగింది. నేను కొన్న అరటిపండు మీద ఉన్న ఈ తెల్లటి మచ్చ ఏంటో ఎవరికైనా తెలుసా అంటూ పోస్ట్ చేశాడు. అరటిపండు పై తెల్లటి మచ్చలు చూసి కొందరు భయపడితే, ఇంకొందరు వాళ్లకు నచ్చిన సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు.

గత ఏడది నాకు కూడా ఇలానే జరిగింది. నేను కొన్న అరటి పండ్లు చూసినట్లయితే, సాలీడు గూడు ఉందని, సాలెపురుగులు బయటికి వస్తున్నాయని చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. కాబట్టి, అరటి పండ్లు కొనేటప్పుడు ఈ తెల్లటి మచ్చలు వంటివి లేకుండా, మంచి అరటి పండ్లను కొనుగోలు చేస్తే మంచిది. లేకపోతే అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది.

Admin

Recent Posts