హెల్త్ టిప్స్

Chicken : చికెన్ తో పాటు.. వీటిని అస్సలు తీసుకోవద్దు..!

Chicken : చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు, కొన్ని పొరపాట్లు చేయడం వలన అనవసరంగా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. చికెన్ అంటే, మీకు కూడా చాలా ఇష్టమా..? చికెన్ ఇష్టమని చికెన్ ఎక్కువ తింటున్నారా..? అయితే, పొరపాటున కూడా చికెన్ తినేటప్పుడు, ఈ పొరపాట్లు చేయకండి. చికెన్ తినేటప్పుడు వీటిని తీసుకున్నట్లయితే, ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

చికెన్ లానే పాలల్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలను చికెన్ తో పాటుగా తీసుకోవడం వలన చర్మం పై తెల్లని మచ్చలు వస్తాయి. చికెన్ తో పాటు పాలు తీసుకోవడం వలన ప్రతిచర్య కలుగుతుంది. కాబట్టి, ఈ పొరపాటున ఎప్పుడు చేయకండి. చికెన్ తో పాటుగా పెరుగుని తీసుకోవడం కూడా మంచిది కాదు. చికెన్ కడుపులో వేడి ని కలిగిస్తుంది. పెరుగు తీసుకుంటే చల్లబడుతుంది.

do not take these foods with chicken

అయితే, రెండు వేరువేరుగా పనిచేస్తాయి. కాబట్టి, రెండింటినీ కలిపి తీసుకుంటే ప్రమాదంలో పడతారు. చికెన్ తో పాటుగా చేపల్ని తీసుకోవడం కూడా మంచిది కాదు. రెండింట్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రెండూ ఒకేసారి తీసుకుంటే, సమస్య కలుగుతుంది. చికెన్ సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా చికెన్ తో పొంద‌వ‌చ్చు.

చికెన్ తీసుకోవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. చికెన్ తినడం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, తగ్గించి తీసుకోవడం మంచిది. అలానే, చికెన్ తినడం వలన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. బరువు పెరిగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది, అలానే మూత్రాశ‌య‌ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, చికెన్ ని మరీ ఎక్కువ తీసుకోవద్దు. కొన్ని సమస్యలు కలుగుతాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండడం మంచిది.

Admin

Recent Posts