lifestyle

దోమలు ప‌గ‌టిపూట ఎందుకు దాక్కుంటాయో తెలుసా ?

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు, దోమ‌లు మ‌న‌పై దాడి చేస్తుంటాయి. భారీ ఎత్తున అవి సంతానాన్ని వృద్ధి చేసి మ‌న‌ల్ని కుడుతుంటాయి. దీంతో మ‌న‌కు ప‌లు ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. అయితే దాదాపుగా దోమ‌ల‌న్నీ ఎక్కువ శాతం రాత్రి పూటే మ‌న‌ల్ని ఎక్కువ‌గా కుడ‌తాయి. డెంగ్యూకు కార‌ణం అయ్యే దోమ‌లు మాత్రం ప‌గ‌టి పూట కుడ‌తాయి. కానీ దోమ‌లు నిజానికి ప‌గ‌టిపూట దాక్కుంటాయి. అందుకు కార‌ణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నం ఎక్కువ సేపు సూర్య‌కాంతిలో ఉండ‌లేం క‌దా. దోమ‌లు కూడా అంతే. వెలుతురులో ఉండ‌లేవు. ఉంటే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తాయి. అందువ‌ల్ల దోమ‌లు వెలుతురులో ఉండ‌వు. కాబ‌ట్టే ప‌గ‌టిపూట అవి దాక్కుంటాయి. అవి ముఖ్యంగా చీక‌టిగా, తేమ‌గా ఉండే ప్ర‌దేశాల్లో దాక్కుంటాయి. ప‌గ‌టి పూట ఆయా ప్ర‌దేశాల్లో అవి దాక్కుంటాయి. అందుక‌నే మ‌న‌ల్ని దోమ‌లు ప‌గ‌లు దాదాపుగా కుట్ట‌వు. ఆ స‌మ‌యంలో అవి దాక్కుని ఉంటాయి.

why mosquitoes hide during day time

సాయంత్రం అయితే చీక‌టి ప‌డుతుంటుంది క‌నుక అవి దాక్కున్న ప్ర‌దేశాల నుంచి బ‌య‌టకు వ‌స్తుంటాయి. ఇక మ‌న ఇళ్ల‌లో గ‌దుల మూలల్లో, టేబుళ్ల కింద‌, సోఫాల కింద‌, వెనుక‌, బెడ్ల కింద‌, క‌ర్టెన్ల చాటున, కప్ బోర్డుల్లో, బుక్ షెల్ఫ్‌ల‌లో, నీరు ఉండే ద‌గ్గ‌ర‌, బ‌ట్ట‌ల మ‌ధ్య, బెడ్ షీట్ల‌లో దాక్కుంటాయి. అందుక‌నే వాటిని తీస్తే దోమ‌లు ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌స్తాయి. అయితే వెలుతురు ఉంటే అవి బ‌య‌ట‌కు రావు. చీక‌ట్లోనే ఉంటాయి. క‌నుక ఇంట్లోకి వెలుతురు, గాలి బాగా వ‌చ్చేలా చేసుకోవాలి.

Admin

Recent Posts