హెల్త్ టిప్స్

Almonds Side Effects : బాదంప‌ప్పును రోజూ తింటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

Almonds Side Effects : ఆరోగ్యానికి మేలు చేసే, ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరు తీసుకుంటూ ఉంటారు. అయితే, బాదం వలన కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బాదంని తీసుకుంటే, చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని చాలామంది బాదంని, ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. కానీ, అధిక మోతాదులో బాదం తీసుకోవడం వలన, చాలా సమస్యలు కలుగుతూ ఉంటాయి. బాదంపప్పుని ఎక్కువగా తీసుకోవడం వలన, ఎటువంటి సమస్యలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. బాదం తీసుకోవడం వలన విటమిన్ ఈ అందుతుంది. అయితే, ఎక్కువగా బాదం ని తీసుకోవడం వలన, స్టమక్ క్రామ్ప్స్, డయరియా సమస్యలు కలుగవచ్చు. కాబట్టి, బాదం ని లిమిట్ గా తీసుకోవడం మంచిది. విటమిన్ ఈ ఎక్కువ ఉండడం వలన బాదం ని అధిక మోతాదులో తీసుకోవడం వలన, బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యానికి బాదం ఎక్కువ మేలు చేస్తుందని చాలామంది అధికమతలో తీసుకుంటూ ఉంటారు. అలా అధిక మోతలో తీసుకోవడం వలన, బరువు పెరిగిపోయే అవకాశం ఉంది.

if you are taking almonds daily then know this

కాబట్టి, లిమిట్ గా తీసుకోవడమే మంచిది. బాదంని అధిక మోతాదులో తీసుకుంటే, కిడ్నీ స్టోన్స్ కలిగే ఛాన్స్ కూడా ఉంది. కిడ్నీ సమస్యలని ఎదుర్కోవాలి కాబట్టి, లిమిట్ గా తీసుకోవడమే మంచిది. ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆహార పదార్థాలని, అధిక మోతాదులో తీసుకుంటే, కచ్చితంగా నష్టాలు అయితే తప్పవు. అలానే, బాదం ని అధిక మోతాదు లో తీసుకోవడం వలన, నట్ ఎలెర్జీ ఉన్నవాళ్ళకి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి.

కొంతమందికి నట్స్ పడవు. అటువంటి వాళ్ళు, ఎలర్జీ రియాక్షన్స్ ని ఎదుర్కోవాలి. ముఖం వేయడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇలా పలు సమస్యలు కలుగుతాయి. అధిక మోతదులో బాదంని తీసుకోవడం వలన, కలిగే నష్టాలను చూశారు కదా.. కాబట్టి, ఈసారి అధిక మోతాదులో బాదం తీసుకోవడం మానేయండి. లేకపోతే ఈ నష్టాలు తప్పవు.

Admin

Recent Posts