Lemon Peel : నిమ్మ‌కాయ తొక్క‌ల‌ను ప‌డేస్తున్నారా ? ఈ లాభాలు తెలిస్తే ఇక‌పై అలా చేయరు..!

Lemon Peel : నిమ్మ‌కాయల వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటి ర‌సాన్ని తాగితే మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. నిమ్మ‌ర‌సంలో ఉండే విట‌మిన్ సి మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డ‌మే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌కాయ‌ల నుంచి ర‌సం తీసి స‌హ‌జంగానే చాలా మంది తొక్క‌ల‌ను ప‌డేస్తుంటారు. కానీ అలా చేయ‌రాదు. నిమ్మ‌తొక్క‌ల వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిని కూడా తిన‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

do not throw away Lemon Peel these are the benefits
Lemon Peel

నిమ్మ‌ర‌సం తాగితే ఎలాగైతే మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో నిమ్మ‌తొక్క‌ల వ‌ల్ల కూడా అలాగే లాభాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌తొక్క‌ను నేరుగా తిన‌లేని వారు దాన్ని ఎండ బెట్టి పొడి చేసి ఉప‌యోగించ‌వ‌చ్చు. లేదా దాన్ని కూడా జ్యూస్‌లా చేసి తీసుకోవ‌చ్చు. ఇలా నిమ్మ‌తొక్క‌ల‌ను తీసుకోవ‌చ్చు. ఇక ఈ తొక్క‌ల్లో నిమ్మ‌ర‌సం కంటే కూడా విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, డి-లైమోనీన్‌, బీటా కెరోటిన్, సిట్రిక్ యాసిడ్‌, మాలిక్ యాసిడ్‌, హెస్పెరిడిన్ అనే పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే నిమ్మ‌తొక్క‌ల్లో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. క‌నుక ఇవి మ‌న‌కు లాభాల‌ను అందిస్తాయి.

నిమ్మ‌తొక్క‌ల్లో ఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఈ తొక్క‌ల్లో డి-లైమోనీన్ అనే స‌మ్మేళ‌నం అధికంగా ఉంటుంది. అందువ‌ల్లే నిమ్మ‌కాయ‌లు ఆ వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఇక ఈ స‌మ్మేళ‌నం యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్స‌ర్ క‌ణాలు నాశ‌నం అవుతాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

డి-లైమోనీన్ శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. దీంతో వాపులు తగ్గుతాయి. నిమ్మ‌తొక్క‌ల్లో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో యాంటీ బాడీల‌ను ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా చేస్తుంది. ఇక నిమ్మ‌తొక్క‌లు కాస్త చేదుగా ఉంటాయి. కానీ వాటిని పొడి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా నిమ్మ తొక్క‌ల‌ను వేసి టీ త‌యారు చేసి కూడా తాగ‌వ‌చ్చు. ఇది కూడా మేలు చేస్తుంది. క‌నుక ఇక‌పై నిమ్మ‌కాయ‌ల‌ను వాడితే తొక్క‌ల‌ను ప‌డేయ‌కండి. వాటితో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts