Putnala Chutney : ఇడ్లీ.. దోశ‌.. ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయినా స‌రే.. పుట్నాల చ‌ట్నీని ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!

Putnala Chutney : చాలా మంది ఇడ్లీలు, దోశ‌లు వంటి టిఫిన్ల‌తో ప‌ల్లీలు లేదా కొబ్బ‌రి చ‌ట్నీల‌ను త‌యారు చేసి తింటుంటారు. అయితే పుట్నాల‌తోనూ చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. స‌రిగ్గా చేయాలే కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఏ టిఫిన్‌లోకి అయినా స‌రే రుచిక‌రంగా పుట్నాల చ‌ట్నీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Putnala Chutney good taste for any breakfast
Putnala Chutney

పుట్నాల చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుట్నాలు – ఒక క‌ప్పు, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి త‌గినంత‌, ప‌చ్చి మిర్చి – 10 , వెల్లుల్లి రెబ్బ‌లు – 5, నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ఎండు మిర‌ప కాయ‌లు – 5 లేదా 6.

పుట్నాల చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత ప‌చ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ప‌ల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత పుట్నాలు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై మూడు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్‌ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ఒక జార్ లో వేయాలి. ఇందులోనే రుచికి త‌గినంత ఉప్పును వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన త‌రువాత ముందుగా గిన్నెలోకి తీసుకున్న పుట్నాల ప‌ప్పు మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుట్నాల చ‌ట్నీ త‌యార‌వుతుంది. దీనిని ఇడ్లీ, దోశ‌, వ‌డ‌, ఊత‌ప్పం వంటి టిఫిన్ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా పుట్నాల ప‌ప్పు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts