హెల్త్ టిప్స్

రోజూ మ‌నం ఎంత ఉప్పును తింటున్నామో తెలుసా..? న‌మ్మ‌లేని నిజం.. షాక‌వుతారు..!

మ‌నం రోజూ వంట‌ల్లో ఉప్పును వాడుతుంటాం. ఉప్పును వేసి అనేక ర‌కాల కూర‌ల‌ను చేస్తుంటారు. ఏ వంట‌కం అయినా స‌రే ఉప్పుదే ప్ర‌ధాన పాత్ర‌. ఉప్పు లేక‌పోతే వంట పూర్తి కాదు. ఉప్పు లేక‌పోతే వంట రుచించ‌దు. అయితే మీకు తెలుసా.. సైంటిస్టులు ఇటీవ‌ల చేసిన అధ్య‌య‌నం ప్ర‌కారం.. మ‌నం రోజూ తినాల్సిన దానిక‌న్నా రెట్టింపు మోతాదులో ఉప్పును తింటున్నామ‌ట‌. అవును.. షాకింగ్ గా ఉన్నా ఇది నిజ‌మే. ఇలా ఉప్పును అధికంగా తింటుండ‌డం వల్ల అనేక రోగాలు వ‌స్తున్నాయ‌ని కూడా వారంటున్నారు.

మ‌నం రోజుకు 5 గ్రాముల వ‌ర‌కు ఉప్పును తిన‌వ‌చ్చు. ఆ మేర మ‌న‌కు అది అవ‌స‌ర‌మే. అంటే ఒక టీస్పూన్ మోతాదులో ఉప్పును తిన‌వ‌చ్చ‌న్న‌మాట‌. కానీ అధ్య‌య‌నాల ప్ర‌కారం సుమారుగా 11 గ్రాముల మేర ఉప్పును తింటున్నామ‌ట‌. అంటే రోజుకు మ‌న‌కు కావ‌ల్సిన దానిక‌న్నా అది దాదాపుగా రెట్టింపు అని అర్థ‌మ‌వుతుంది. ఇలా ఉప్పును అధికంగా తింటుండ‌డం వ‌ల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు వ‌స్తున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో పాదాలు, చేతుల్లో నీరు వ‌చ్చి చేరుతుంది. అక్క‌డ వాపులు వ‌స్తాయి. ఫ‌లితంగా వేలితో నొక్కితే లోప‌లికి పోతుంది. ఇలా గ‌న‌క ఎవ‌రికైనా జ‌రుగుతుంటే వెంట‌నే ఉప్పును తిన‌డం త‌గ్గించాలి. లేదంటే మానేయాలి.

do you know how much salt is we are consuming

ఇక ఉప్పును అధికంగా వాడితే సోడియం నిల్వ‌లు శ‌రీరంలో పెర‌గ‌డం వ‌ల్ల దాన్ని బ‌య‌ట‌కు పంప‌డం కోసం కిడ్నీలు బాగా శ్ర‌మించాల్సి ఉంటుంది. దీంతో దీర్ఘ‌కాలంలో కిడ్నీలు చెడిపోయేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అలాగే ఉప్పును అధికంగా తీసుకుంటే వృద్ధాప్యంలో ఎముక‌లు పెళుసుగా మారిపోతాయి. చిన్న దెబ్బ తాకినా సుల‌భంగా విరిగిపోతాయి. దీంతో మ‌ళ్లీ ఎముక‌లు అతుక్కుపోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అలాగే ఉప్పు వాడ‌కం ఎక్కువైతే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి. దీంతోపాటు మైగ్రేన్ వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఉప్పును అధికంగా వాడుతున్న వారు వెంట‌నే దాని వాడ‌కాన్ని త‌గ్గించండి. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. కాబ‌ట్టి ఉప్పు విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

Admin

Recent Posts