Fish Head : చేపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేపలతో రకరకాల వంటకాలను వండుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. మాంసం కంటే కూడా కొందరు చేపలను తినడానికే ఇష్టపడతారు.కొందరు చేప తలను కూడా తింటారు. కొందరూ దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే చేప తలను తినవచ్చా.. తినకూడదా.. చేపలతో పాటు చేప తలను తింటే మనం ఎటువంటి ఫలితాలను పొందవచ్చు.. వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల్లో చేప ఒకటి. చేపతో పాటు చేప తలను కూడా తినవచ్చు.
చేప తలను తినడం వల్ల కూడా మనం ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. చేప తలలో కూడా మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ డి, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. చేపలతో పాటు చేప తలను తినడం వల్ల గుండెకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. చేప తలను తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే ట్రై గ్లిజరాయిడ్స్ 30 శాతం వరకు తగ్గుతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గు ముఖం పడతాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు చేపలతో పాటు చేప తలభాగాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
చికెన్, మటన్ వంటి వాటిని తీసుకోవడం కంటే చేపలను, చేప తలను తీసుకోవడం వల్ల మనం అధిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కంటి చూపును పెంచడంలో చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే వయసు మీద పడే కొద్ది చాలా మంది అల్జీమర్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు చేపలను తరచూగా తీసుకోవడం వల్ల మంచి మెదడు ఆరోగ్యం మెరుగుపడి అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చేప తలలో బూడిద రంగు పదార్థం ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో, మన భావాలను అదుపులో ఉంచుకునేలా చేయడంలో సహాయపడుతుంది. చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల డిఫ్రెషన్ కు దూరంగా ఉండవచ్చు. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. వారానికి రెండు సార్లు చేపలను, చేప తలను తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
ఏకాగ్రత పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడే వారు మాంసం కంటే చేపలను తినడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. అలాగే చేప తలను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు నశిస్తాయి. అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికి చేపలను కూరగా వండుకుని తినడమే మంచిది. వీటిని వేయించి తింటే అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా చేపలను, చేప తలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వీటిని ప్రతి ఒక్కరు ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.