హెల్త్ టిప్స్

వేసవి కాలం సబ్జా గింజల పానీయం ఎందుకు త్రాగాలో తెలుసా …!

వేసవి కాలం వచ్చేసింది. శరీరంలో నీరంతా చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. దీని వల్ల డీ హైడ్రేషన్ బారిన పడటం తద్వారా అలసట, వడ దెబ్బ తగలటం వంటివి వస్తాయి. వీటిని తట్టుకోవడానికి శరీరానికి సరిపడా నీటిని జ్యూస్ ల రూపంలోనూ, పల్చటి మజ్జిగ ఉప్పు కలిపి కాని లేదా లేత కొబ్బరి నీరు తాగడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకోగలము. అయితే సబ్జా గింజల పానీయం తాగడం వల్ల కూడా ఎండ తీవ్రత మన మీద ఉండదు.

శరీరంలో వేడి చేసినప్పుడు సబ్జా గింజలను నాన బెట్టుకుని పంచదార కలుపుకుని త్రాగేవారు.ఈ పానీయాన్ని ఉదయాన్నే తాగితే చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా గింజల పానీయం తాగడం వల్ల శరీరంలో నీటి శాతాన్ని క్రమ బద్దీకరిస్తుంది. ఇంకా మన శరీరానికి కావలసిన విటమిన్లను, పీచు పదార్థాలను ఇంకా అనేక పోషకాలను అందిస్తుంది. శరీరంలో ఉన్న మలినాలను బయటికి పంపించి రక్తాన్ని శుద్ది చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

do you know why we need to take sabja seeds water in summer

సబ్జా గింజలను నానబెట్టిన నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, పంచదార కలిపి తాగితే అజీర్ణం, గ్యాస్, మల బద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. రోజంతా నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను రాత్రి పడుకునే ముందు తాగితే అధిక బరువు ని తగ్గిస్తుంది. ఈ పానీయంలో పంచదార కలపకుండా తాగితే షుగర్ పేషెంట్స్ కి షుగర్ అదుపులో ఉంటుంది. ఇంకా ఇది యాంటి బయాటిక్ గా పనిచేసి అనేక రకాల ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది. గోరు వెచ్చని నీటిలో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే అన్ని రకాల శ్వాస కోశ వ్యాధులు తగ్గుతాయి.

Admin

Recent Posts