మనం ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తాం. మరియు మువ్వన్నెల జెండా కుల మత జాతి బేదాల తో సంబంధం లేకుండా భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేది జాతీయ జెండానే. అందుకే జాతీయ జెండా విషయంలో చాలా శ్రద్ధ చూపించింది మన రాజ్యాంగం. రాజ్యాంగంలో జాతీయ జెండా గురించి పొందపరిచిన నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. జాతీయపతాకాన్ని ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి. 2. మన జాతీయ జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 3. ప్లాస్టిక్ జెండా వాడకాన్ని నిషేధించాలి. 4. కాషాయం,తెలుపు, ఆకుపచ్చ రంగులు మూడు పైనుంచి కిందకు సమానంగా ఉండాలి. 5. జెండాను నేలపై కానీ నీటిపై కానీ పడవేయ రాదు. 6. జెండా పై ఎలాంటి రాతలు సంతకాలు ప్రింటింగ్ వంటివి చేయరాదు.
7. జాతీయ పతాకాన్ని ఎప్పుడూ నిటారుగా తల ఎత్తుకొని చూసేలా మాత్రమే ఉండాలి. 8. దీన్ని కిందకు కానీ పక్కకు కానీ వంచరాదు. 9. జాతీయ పతాకాన్ని ఎప్పుడైనా సరే వేగంగా ఎగర వేయాలి. 10. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలోనే జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలి. 11. జాతీయ పతాకం మధ్యలో ఉన్న ధర్మ చక్రంలో 24 ఆకులు స్పష్టం గా కనబడాలి. 12. జెండా పాత బడితే ఇతర అవసరాలకు వాడరాదు.
13. ఎక్కడబడితే అక్కడ పడేయరాదు. 14. ఏవైనా వేరే జెండాలతో జాతీయ పతాకాన్ని ఎగుర వేయ వలసి వస్తే, జాతీయ జెండా మిగిలిన జెండాల కంటే ఎత్తులో ఉండాలి. 15. జెండా ఎగురవేసేటప్పుడు జాతీయ నాయకుల ఫోటోలు మాత్రమే ఉంచాలి. 16. జెండా వందనం నియమ నిబద్దత నిబంధనలతో చేయాలి.