Belly Fat : ఈ రోజుల్లో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల అందరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడడానికి మార్కెట్ లో దొరికే అన్ని రకాల మందులను వాడుతున్నారు. అధిక బరువు వల్ల మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలో కొవ్వు లేని భాగం ఉండదు. ప్రతిభాగంలోనూ కొవ్వు పేరుకుపోతుంది. నడుము చుట్టు ఉన్న కొవ్వు కారణంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. పొట్ట తగ్గడం అనేది చాలా కఠినమైన సమస్య. అలా అని తినకుండా పొట్టను మాడ్చుకోలేము. వ్యాయామాలు కూడా అందరూ చేయలేరు.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సహజసిద్ద పద్దతిలో ఎలా కరిగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువుతో బాధపడే వారు ఇంట్లో ఈ పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా వారం రోజుల పాటు తాగడం వల్ల పొట్టలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు. కొవ్వును కరిగించే ఈ పానీయాన్ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గాను కీరదోస ముక్కలను, కొత్తిమీరను, పైనాపిల్ ముక్కలను, కొంచెం పాలకూరను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా అన్నింటినీ శుభ్రం చేసుకుని ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకుని కొద్దిగా నీటిని పోసి జ్యూస్ లా చేసుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇందులో ఎటువంటి తీపి పదార్థాలను కలపకూడదు. అదే విధంగా ఈ జ్యూస్ ను తయారు చేసిన 15 నిమిషాల్లోనే తాగాలి. అలా తాగడం వల్ల ఈ పానీయంలో ఉన్న న్యూట్రియంట్స్ తగ్గకుండా ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. కీరదోస శరీరాన్ని చల్లగా ఉంచడంతోపాటు బరువు తగ్గడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. పైనాపిల్ లో ఉండే డైటరీ ఫైబర్ కడుపులో ఉన్న మలినాలను బయటకు పంపిస్తుంది. క్రమం తప్పకుండా వారం రోజుల పాటు ఈ జ్యూస్ ను తాగడం వల్ల అధిక బరువు తగ్గడంతోపాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది.