హెల్త్ టిప్స్

Water : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో నీళ్ల‌ను త‌ప్ప‌కుండా తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Water : ప్రతి జీవి మనుగడకు నీరు ఎంతో అవసరం. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి, శరీర ఉష్ణోగ్రతను సక్రమంగా నిర్వహించడం, సున్నితమైన కణజాలాలను రక్షించడం, కీళ్ళలో ద్రవపదార్థం త‌యారు చేయడం వంటి ముఖ్యమైన పనులను నిర్వహించడానికి కూడా నీరు అవసరం. కానీ ఖాళీ కడుపుతో నీరు త్రాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలిసిన విషయమే. ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక బాటిల్ నీటిని త్రాగితే శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఈ మార్పులను చూస్తే మీకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రతి మనిషి దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్ర పోతారు. గాఢనిద్రలో ఉన్న సమయంలో నీరు తాగాలి అనే ఆలోచన కూడా రాదు. నిద్రపోయే సమయంలో శరీరం డీహైడ్రేట్ అవడం మొదలవుతుంది. ఉదయం లేవగానే ఒక లీటరు నీటిని తాగడం ద్వారా శరీరం మళ్ళీ రీహైడ్రేట్ అవుతుంది. మనం చాలాసార్లు గమనించే ఉంటాం.. ఉదయాన్నే మనం ఏమీ తినకుండా ఉండటం వల్ల ప్రేగులు అతుక్కుని ఉంటాయి. నీటిని త్రాగకుండా డైరెక్ట్ గా ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కడుపులో నొప్పి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం నీటిని తాగుతామో ప్రేగుల కదలికకు సహాయపడుతుంది. ఈ విధంగా లీటర్ నీటిని త్రాగటం వలన జీర్ణక్రియ రేటు పెరిగి కేలరీలు అధికంగా ఖర్చు అవుతాయి.

drink water on empty stomach for many benefits

దానివలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగి బరువు తగ్గుతారు. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక లీటర్ నీటిని తాగడం ద్వారా మలబద్దకం సమస్య కూడా తొలగిపోయి విరేచనం సాఫీగా అయ్యి ఆకలి కూడా పెరుగుతుంది. నీరు ఎర్ర రక్త కణాల పెరుగుదలను వేగంవంతం చేసి రక్తంలో ఎక్కువ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కారకాల కలయిక వలన మెదడుకు 70 శాతంకి పైగా నీరు అందుతుంది. మెదడు హైడ్రేడ్ గా ఉంటేనే జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరులో గణనీయమైన మార్పులు వస్తాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల తలనొప్పి, అలసట, అజీర్తి అనేది దరిచేరకుండా చేస్తుంది. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీరు త్రాగడం ద్వారా చర్మం కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయల‌ను కూడా దరిచేరనివ్వదు.

Admin

Recent Posts