హెల్త్ టిప్స్

Barley Water : ఉద‌యాన్నే బార్లీ నీళ్ల‌ను తాగితే క‌లిగే 5 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Barley Water : ఆరోగ్యానికి, బార్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది. బార్లీని తీసుకోవడం వలన, అనేక రకాల సమస్యలకి దూరంగా ఉండవచ్చు. వేసవికాలంలో, బార్లీ వాటర్ తాగడం వలన, వేసవి వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో వేడిని తగ్గించే గుణం, బార్లీకి ఉంది. బార్లీ ని తీసుకుంటే, పలు రకాల ప్రయోజనాలని పొందవచ్చు. కాబట్టి, అప్పుడప్పుడు బార్లీ ని తీసుకోవడం మంచిదే. ఇక బార్లీ వల్ల కలిగే ఉపయోగాలు, బార్లీని తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు అనే విషయం ని తెలుసుకుందాం.

బార్లీ నీళ్లు తాగితే, శరీరం చల్లబడుతుంది. శరీరంలో వేడి బయటకు వెళ్లిపోయి, చల్లగా శరీరం మారుతుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండాలంటే, బార్లీ వాటర్ ని తీసుకోండి. వడదెబ్బ కూడా తగలదు. క్యాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్, రాగి వంటి పోషకాలు ఉన్నాయి. అలానే, బార్లీ వాటర్ ని తీసుకోవడం వలన అజీర్తి సమస్యలకి కూడా, దూరంగా ఉండవచ్చు. బార్లీలో పీచుపదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి ఇబ్బందులు ఉండవు.

drinking barley water on empty stomach many benefits

బార్లీ వాటర్ ని రోజూ తీసుకోవడం వలన, శరీరంలో ఉండే వ్యర్ధపదార్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. షుగర్ పేషెంట్లు బార్లీ వాటర్ ని తీసుకుంటే, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇన్సులిన్ కూడా అదుపులో ఉంటుంది. షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలని, కంట్రోల్ చేసుకోవాలంటే, రోజు బార్లీ వాటర్ ని తీసుకోవడం మంచిది. డైట్రి ఫైబర్ కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది.

దీర్ఘకాలిక వ్యాధులను బార్లీ తగ్గిస్తుంది. బార్లీ ని తీసుకోవడం వలన, గుండె సమస్యలు కూడా తగ్గుతాయి. బార్లీలో డైట్రి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది నీటిలో కరిగిపోతుంది. దీన్ని తీసుకోవడం వలన, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయి. ఫైబర్ పుష్కలంగా తినే వాళ్ళు, హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం బాగా తక్కువ ఉంటుంది. బార్లీ చెడు కొలెస్ట్రాల్ ని కూడా, ఈజీగా కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడానికి, బార్లీ ఉపయోగపడుతుంది. బార్లీ వాటర్ ని తీసుకుంటే, కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. జీర్ణ క్రియ ని కూడా ఇది పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల కి కూడా, ఇది దూరంగా ఉంచుతుంది. ఇలా, ఇన్ని లాభాలని మనం పొందవచ్చు.

Share
Admin

Recent Posts