హెల్త్ టిప్స్

Sleeping On Stomach : మీరు రోజూ బోర్లా ప‌డుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Sleeping On Stomach : ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. చాలామంది నిద్రపోయేటప్పుడు బోర్లా పడి నిద్రపోతూ ఉంటారు. బోర్లా పడుకుని నిద్రపోవడం మంచిదా, కాదా..? ఏమైనా సమస్యలు వస్తాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు అస్సలు బోర్లా పడుకుని నిద్రపోకూడదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. బోర్లా పడుకోవడం వలన ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా మీరు నిద్రపోయినప్పుడు మీకు ఛాతి నొప్పి కలిగితే క‌చ్చితంగా డాక్టర్ని సంప్రదించండి.

బోర్లా పడుకోవడం వలన చర్మ సమస్యలు కూడా కలుగుతాయి. ముఖ సౌందర్యం బాగా దెబ్బతింటుంది. చర్మానికి తగినంత ఆక్సిజన్ అందదు. చర్మం ముడుచుకోవడం మొదలవుతుంది. ముఖం కూడా పాడవుతుంది. కాబట్టి ఇలా నిద్రపోవడం మంచిది కాదు. గర్భధారణ సమయంలో స్త్రీలు అసలు ఇలా పడుకోకూడదు. ఇలా పడుకోవడం వలన తల్లి, బిడ్డకు ఇద్దరికీ కూడా హాని కలుగుతుంది.

you should not sleep on stomach know the reasons

గర్భిణీ మహిళలు కుడి వైపుకి లేదా ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవాలి. బోర్లా మాత్రం పడుకోకూడదు. పురుషులు కూడా బోర్లా పడుకోకూడదు. బోర్లా పడుకోవడం వలన ఉదర సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. అజీర్తి, గుండెలో మంట వంటి సమస్యలు కలుగుతాయి. వెన్నెముకకు కూడా అసలు మంచిది కాదు.

వెన్నెముకపై ఒత్తిడి బోర్లా పడుకోవడం వలన కలుగుతుంది. కాబట్టి అలా పడుకోకూడదు. బోర్లా పడుకోవడం వలన మెడ నొప్పి వంటివి కూడా కలుగుతాయి. కాబట్టి ఇలా నిద్రపోయే అలవాటు ఉంటే, మానుకోవడం మంచిది. లేదంటే అనవసరంగా ఇన్ని సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం మంచిది. రాత్రిళ్ళు త్వరగా నిద్రపోయి, ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Share
Admin

Recent Posts