Dry Coconut : రోజూ ఎండు కొబ్బ‌రిని మిస్ చేయకుండా తినండి.. ఏం జ‌రుగుతుందో మీరే చూస్తారు..!

Dry Coconut : మ‌న వంటింట్లో అనేక ర‌కాల ప‌దార్థాలు ఉంటాయి. వాటిల్లో ఎండు కొబ్బ‌రి కూడా ఒక‌టి. దీన్ని చాలా మంది త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటారు. దీంతో చ‌ట్నీ ఎక్కువ‌గా చేస్తుంటారు. కొంద‌రు మ‌సాలా వంట‌కాల్లోనూ దీన్ని తురిమి వేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఎండు కొబ్బ‌రిని నేరుగా కూడా తిన‌వ‌చ్చు. దీన్ని రోజూ చిన్న ముక్క తిన్నా చాలు మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఎండు కొబ్బ‌రిని రోజూ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు కొబ్బ‌రిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, విట‌మిన్లు, ఐర‌న్, క్యాల్షియం, మాంగ‌నీస్‌, సెలీనియం ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు స‌హాయ‌ప‌డతాయి.

ఎండు కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల శరీరం వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి సుర‌క్షితంగా ఉంటుంది. అలాగే చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎండు కొబ్బ‌రిని తింటే క్యాల్షియం పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇది ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది. బోలు ఎముక‌ల వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎండు కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అల్జీమ‌ర్స్ త‌గ్గుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కూడా ఎండు కొబ్బ‌రి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవుతుంది.

Dry Coconut what are the benefits of taking them daily
Dry Coconut

ఎండు కొబ్బ‌రిలో స‌మృద్ధిగా ఉండే ఐర‌న్ ర‌క్తం ఎక్కువ‌గా త‌యార‌య్యేలా చేస్తుంది. దీంతో రక్త‌హీన‌త త‌గ్గుతుంది. ఎండు కొబ్బ‌రిని తీసుకుంటే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. సంతానం లేని వారు ఎండు కొబ్బ‌రిని రోజూ తిన‌డం వ‌ల్ల సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. క్యాన్స‌ర్ ముప్పు త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే దీన్ని రోజూ మోతాదులోనే తినాలి. ఎక్కువ‌గా తింటే అజీర్తి చేస్తుంది. కొంద‌రికి విరేచ‌నాలు, వాంతులు కావ‌చ్చు. క‌నుక మోతాదులో దీన్ని తింటేనే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

Share
Editor

Recent Posts