మనలో చాలా మందికి పెరుగు అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుకనే భోజనం చివర్లో కచ్చితంగా పెరుగును తింటారు. భోజనం చివర్లో పెరుగును తినకపోతే అసలు భోజనం చేసిన భావనే కలగదు. అందుకని చాలా మంది పెరుగును తినేందుకు ఇష్టపడతారు. ఇక స్వచ్ఛమైన తియ్యని గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టమే. అయితే రోజూ పెరుగు తినేవారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అవేమిటంటే..
* పెరుగులో అనేక రకాల ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల పెరుగును తింటే రోజూ ప్రోటీన్స్ లభిస్తాయి. దీంతో కండరాల నిర్మాణం జరుగుతుంది. శక్తి లభిస్తుంది.
* పెరుగులో ఉండే మంచి బాక్టీరియా మన శరీరంలోని జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు దోహదం చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ ఉండవు.
* పెరుగును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తికి పెరుగు సహాయ పడుతుంది.
* పెరుగులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
* పెరుగును రోజూ తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. పెరుగులో విటమిన్ ఇ, జింక్, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి.
* పెరుగును తినడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.