మానవ శరీరానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. మనిషికి ప్రాధమిక దశ నుంచి వృద్ధాప్య దశ వరకు వివిధ రకాల పండ్లు, వివిధ దశల్లో ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ప్రతి మనిషి ఆరోగ్యానికి పండ్లు తీసుకోవడం తప్పనిసరి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మనిషి పెరుగుదలకు తోట్పడటమే కకుండా. ఆరోగ్య వంతమైన జీవితానికి సహకరిస్తాయి.
ఆపిల్, ఖర్జూరం, సపోట, మామిడి మొదలగు పండ్లను నిత్యం సేవించే వారికి, నాడీమండలము చైతన్యవంతంగా ఉంటుంది. మానసిక అలసట, చికాకు తగ్గి – జ్ఞాపకశక్తి అధికమవుతుంది. ఇకా నపుంసకత్వము నివారించబడుతుంది. నిద్రలేమి నశిస్తుంది.
యాపిల్, కమల, అరటి, నిమ్మ మొదలగు వాటిలో కాల్షియమ్, ఐరన్, ఏ, బీ, సీ విటమిన్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను సక్రమంగా పని చేయించుటలో బహు చక్కని పాత్రను నిర్వహిస్తాయి. గర్భవతులైన స్త్రీలు – ఫల రసాలను నిత్యము సేవిస్తూ వుంటే… ఎంతో మంచిది
ఎందుకంటే పిండము ఏర్పడిన కొద్దికాలము నుండే – ఆ పిండము యొక్క, గుండె పని చేస్తుంది. గుండె పని చేయుటలో తల్లి సేవించిన పండ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. రక్తపోటు గలవారికి పుచ్చకాయ అమోఘముగా పని చేస్తుంది.