అర‌టి ఆకుల్లో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

పూర్వ‌కాలంలో ఇప్ప‌ట్లోలా ప్లేట్లు ఉండేవి కావు. దీంతో మ‌ట్టి ప్లేట్లు, అర‌టి ఆకుల్లో ఎక్కువ‌గా భోజ‌నం చేసేవారు. ఇప్ప‌టికీ కొంద‌రు అదే సాంప్ర‌దాయాన్ని పాటిస్తున్నారు. అయితే నిజానికి అర‌టి ఆకుల్లో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. సైంటిఫిక్‌గా వాటిని నిరూపించారు కూడా. అందువ‌ల్ల అర‌టి ఆకుల్లో భోజ‌నం చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

eating on banana leaf is beneficial know the benefits

* అర‌టి ఆకుల్లో పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గ్రీన్ టీలోనూ ఉంటాయి. ఈ క్ర‌మంలో మ‌నం అర‌టి ఆకుల‌పై ఆహారాల‌ను ఉంచి భోజ‌నం చేస్తే ఆ ఆహారాల్లో పాలిఫినాల్స్ చేరుతాయి. అవి అనేక వ్యాధులు రాకుండా చూస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

* అర‌టి ఆకుల్లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

* అర‌టి పండ్ల‌లో మాదిరిగానే అరటి ఆకుల్లోనూ పోషకాలు ఉంటాయి. అందువ‌ల్ల ఆ ఆకుల‌పై ఆహారాల‌ను ఉంచి భోజ‌నం చేస్తే వాటిల్లోని పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటాం.

* అర‌టి ఆకుల‌ను ఆయుర్వేదంలోనూ ఉప‌యోగిస్తారు. ఇందులో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అర‌టి ఆకుల్లో తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

* అర‌టి ఆకుల్లో ఆహారాల‌ను ఉంచ‌డం వ‌ల్ల ఆహారాల‌కు రుచి వ‌స్తుంది. ఆహారాల‌ను ఇష్టంగా తింటారు.

Admin

Recent Posts