గుండె నొప్పి, గ్యాస్ నొప్పి.. రెండింటిలో ఏ నొప్పి అనేది ఎలా తెలుసుకోవాలి ?

మ‌న‌లో చాలా మందికి గ్యాస్ స‌మ‌స్య ఉంటుంది. ఇది స‌హ‌జ‌మే. గ్యాస్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే గ్యాస్ వ‌ల్ల ఒక్కోసారి ఛాతిలో నొప్పి వ‌స్తుంది. దీంతో ఆ నొప్పిని గుండె నొప్పి అనుకుని ఆందోళ‌న చెందుతారు. అయితే అలా అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం మంచిదే. కానీ గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి తేడాలు ఉంటాయి. అవేమిటంటే..

differences between gas and heart pain know them

గ్యాస్ నొప్పి వ‌స్తే క‌నిపించే ల‌క్ష‌ణాలు

* ఛాతిలో ఎడ‌మ వైపు నొప్పిగా ఉంటుంది.

* క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది.

* సాధార‌ణ లేదా పుల్ల‌ని త్రేన్పులు వ‌స్తాయి.

* క‌డుపులో మంట‌గా ఉంటుంది. గుండెల్లో మంట వ‌స్తుంది.

గుండె నొప్పి వ‌స్తే శ‌రీరంలో ఈ భాగాల్లో నొప్పి వ‌స్తుంది.

గుండె నొప్పి వ‌స్తే క‌నిపించే ల‌క్ష‌ణాలు

* గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. ఛాతి మీద ఏదో బ‌రువు పెట్టిన‌ట్లు అనిపిస్తుంది.

* విపరీతమైన చెమట పడుతుంది.

* ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ ఉంటాయి.

* కొంద‌రిలో విరేచ‌నాలు అవుతాయి.

* కొంద‌రికి వాంతులు అవుతాయి.

* ఎడ‌మ వైపు ద‌వ‌డ నొప్పిగా ఉంటుంది. ప‌ట్టేసిన‌ట్లు అనిపిస్తుంది.

* ఛాతి మ‌ధ్య భాగం నుంచి నిలువుగా గ‌డ్డం వ‌ర‌కు నొప్పి ఉంటుంది.

* కొంద‌రికి ఛాతి మొత్తం నొప్పి ఉంటుంది.

* స్పృహ త‌ప్పి ప‌డిపోతారు.

ఇలా గ్యాస్ నొప్పి, గుండె నొప్పి ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే కొంద‌రికి గ్యాస్ నొప్పి ల‌క్ష‌ణాల‌తోనూ గుండె నొప్పి వ‌స్తుంది. క‌నుక ఏ నొప్పి అయినా స‌రే అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ఎందుకైనా మంచిది ప‌రీక్ష‌లు చేయించుకుంటే మంచిది. స‌మ‌స్య లేక‌పోతే స‌రే. కానీ ఉంటే మాత్రం ప‌రీక్ష‌ల్లో తెలుస్తుంది. దీంతో గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

Admin

Recent Posts