Epsom Salt : ఎప్పుడైనా ఎక్కువగా పని చేసినప్పుడు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉండడం సహజం. అలాగే ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ ల బారిన పడినప్పుడు నొప్పులు ఎక్కువ కాలం పాటు ఉంటాయి. చాలా మంది ఈ నొప్పులను తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. కానీ పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ నొప్పులను ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా మంది పెయిన్ కిలర్ లనే వాడుతూ ఉంటారు. ఇలా నొప్పులతో బాధపడే వారు పెయిన్ కిల్లర్ లను వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా లభించే ఎప్సమ్ సాల్ట్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు.
ఈ ఉప్పును పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ ఎప్సమ్ సాల్ట్ తో మర్దనా చేసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి. కండరాలకు ఉపశమనాన్ని కలిగించి నొప్పిని తగ్గించడంలో ఈ సాల్ట్ ఎంతో దోహదపడుతుంది. ఈ మెగ్నీషియం సల్ఫేట్ కండరాల్లో ఉండే కణజాలాల్లోకి వెళ్లి నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేసారు. శరీరమంతా నొప్పులుగా ఉన్నప్పుడు ముందుగా శరీరానికి ఆవ నూనెను రాసుకోవాలి. తరువాత ఎప్సమ్ సాల్ట్ ను పొడిగా చేసి శరీరానికి రాసుకుని మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కండరాలు విశ్రాంతికి గురి అయ్యి నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఇలా మర్దనా చేసుకున్న వేడి నీళ్లతో స్నానం చేయాలి లేదా స్టీమ్ బాత్ చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే నొప్పులతో బాధపడే వారు బాత్ టబ్ లలోవేడి నీటిని నింపాలి.
తరువాత ఇందులో 150 నుండి 200 గ్రాముల ఎప్సమ్ సాల్ట్ ను వేసి కలపాలి. తరువాత ఈ నీటిలో 15 నుండి 20 నిమిషాల పాటు ఉండడం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి. అలాగే పాదాల నొప్పులు, చేతల నొప్పులతో బాధపడే వారు గిన్నెలో లేదా బకెట్ లో వేడి నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో పాదాలను, చేతులను ఉంచాలి. ఇలా 20 నిమిషాల పాటు ఉంచడం వల్ల పాదాల నొప్పులు, పిక్కల నొప్పులు, చేతుల నొప్పులు తగ్గుతాయి. అలాగే నొప్పులతో బాధపడే వారు వేడి నీటిలో ఎప్సమ్ సాల్ట్ ను వేయాలి. తరువాత ఈ నీటితో కాపడం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా ఎప్సమ్ సాల్ట్ సహజ సిద్ద పెయిన్ కిల్లర్ లా పని చేస్తుందని దీనిని ఉపయోగించడం వల్ల నొప్పులు తగ్గడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు.