Coconut Water : చాలామంది కొబ్బరి నీళ్లని తీసుకుంటూ ఉంటారు. కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన శక్తి పెరుగుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా కూడా కొబ్బరి నీళ్లు ఉంచుతాయి. అయితే కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తీసుకోవచ్చా..? తీసుకోకూడదా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా ఈ సందేహం ఉంటే ఇప్పుడే తెలుసుకోండి. కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని నష్టాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కొబ్బరి నీళ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అయితే ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటితో పోల్చి చూసుకున్నట్లయితే, చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. క్యాలరీలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. 11 ఔన్సుల కొబ్బరి నీళ్లలో సుమారు 60 క్యాలరీలు ఉంటాయి. అయితే కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే యూరిన్ కూడా ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది. లిమిట్ గా తీసుకుంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కొంతమందికి ఏదైనా పండు లేదంటే కూరగాయలు పడవు. ఎలర్జీ ఉంటుంది. ఒకవేళ కనుక కొబ్బరి అలర్జీ ఉంటే, వాళ్ళు తీసుకోకుండా ఉండడం మంచిది అని డాక్టర్లు చెప్తున్నారు. కొబ్బరి నీళ్లలో సోడియం తక్కువ ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరినీళ్లని తీసుకుంటే శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది. సో బాగా అధికంగా తీసుకోవడం వలన ఇబ్బంది పడాలి.
తక్కువ రక్త పోటుకి లేదా అధిక రక్తపోటుకి ఇది ప్రమాదాన్ని కలిగించవచ్చు. అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపోటు వున్న వాళ్లు కొబ్బరి నీళ్లు తీసుకుంటే ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లలో లవణాల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. క్రీడాకారులు అధికంగా తీసుకోవడం వలన నీటిని కోల్పోయేలా చేస్తుంది. కిడ్నీ సమస్యలకి కూడా ఇది కారణం అవ్వచ్చు. కాబట్టి లిమిట్ గానే కొబ్బరినీళ్ళని తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు.