వయసులో పురుషులు చాలా మంది ఊబకాయం, భారీ ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీని వల్ల కణాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీంతో పురుషుల్లో వీర్య కణాల సంఖ్యతో పాటు నాణ్యత కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల వారిలో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. ఇన్సులిన్ నిరోధకత రావడం వల్ల పురుషుల రక్తంలో ఎస్ హెచ్ బిజి( సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబిలిన్) అనే హార్మోన్ ఎక్కువగా తయారవుతుంది. ఈ హార్మోన్ పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ నిర్వీర్యం చేస్తుంది. దీంతో పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుతుంది. ఈ హార్మోన్ తగ్గడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే పురుషుల్లో సంతానలేమి సమస్యలు రావడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు.
ఇటువంటి సమస్యతో బాధపడే పురుషులు మెంతులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెంతులను వాడడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. రోజూ ఉదయం 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాముల మెంతులను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే మెంతులను తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. 2011 లో ఆప్లైడ్ న్యూట్రిషియన్ ఆండ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. మెంతులు తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్యతో పాటు నాణ్యత కూడా పెరుగుతుందని వారు చెబుతున్నారు.
కనుక ఊబకాయంతో బాధపడే వయసులో ఉన్న పురుషులు, సంతానలేమితో బాధపడే పురుషులు రోజూ 10 గ్రాముల మోతాదులో మెంతులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెంతులను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గడంతో పాటు వీర్య కణాల సంఖ్య మరియు వాటి నాణ్యత కూడా పెరుగుతుందని వారు చెబుతున్నారు.