Milk Powder Laddu : మనం పాలపొడితో వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పాలపొడితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పాల పొడితో సులభంగా చేసుకోదగిన తీపి వంటకాల్లో లడ్డూలు కూడా ఒకటి. పాల పొడితో చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, పండగలకు ఇలా పాలపొడితో లడ్డూలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పాలపొడితో రుచిగా, మృదువుగా లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్క్ పౌడర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 75 ఎమ్ ఎల్, జీడిపప్పు పలుకులు – పావు కిలో, మిల్క్ పౌడర్ – పావు కప్పు.
మిల్క్ పౌడర్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు పలుకులు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో పాలపొడిని తీసుకోవాలి. తరువాత వేడి వేడి నెయ్యి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలపాలి. తరువాత చేత్తో గట్టిగా వత్తుతూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఈ పాలపొడి లడ్డూలుగా చుట్టడానికి రాకపోతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఒకవేళ పాలపొడి మరీ మెత్తగా అయితే మరికొద్దిగా పాలపొడి వేసుకోవాలి. ఇలా లడ్డూలుగా చుట్టుకున్న తరువాత ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిల్క్ పౌడర్ లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.