Fever In Kids : ప్రస్తుత కాలంలో చంటి పిల్లలు ఎక్కువగా తరుచూ జ్వరాలతో బాధపడుతున్నారు. వారిలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో తరుచూ జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం వచ్చినప్పుడల్లా వారు రెండు నుండి మూడు కిలోల బరువు తగ్గిపోతున్నారు. జ్వరం నుండి కోలుకుని మరలా కొద్దిగా కండ పట్టేసరికి మరలా జ్వరం వచ్చి బలహీనంగా అయిపోతున్నారు. ఇలా జ్వరం వచ్చినప్పుడల్లా పిల్లలకు సరిగ్గా నిద్ర ఉండదు. వారి వల్ల తల్లి దండ్రులకు కూడా నిద్ర సరిగ్గా ఉండదు. అలాగే జ్వరం వచ్చినప్పుడల్లా వేలకు వేలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలా మంది పిల్లల్లో ఎన్ని మందులు వాడినప్పటికి ఇలా జ్వరం, జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూనే ఉంటారు. అయితే జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్ కు వెళ్లే అవసరం లేకుండా కొన్ని చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా పిల్లల్లో వచ్చే జ్వరం, ఇన్పెక్షన్ లు తగ్గేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే, వారికి కొద్దిగా నలతగా ఉన్న వెంటనే తల్లి దండ్రులు వెంటనే మందులు వేసేస్తూ ఉంటారు. ఇదే మనం చేసే అతి పెద్ద తప్పని నిపుణులు చెబుతున్నారు. అలాగే వారికి జ్వరం వచ్చినప్పుడు పాలు తాగాలి అనిపించదు. ఆహారం తీసుకోవాలని అనిపించదు. కానీ పిల్లలకు బలవంతంగా పాలు తాగించాలని, ఆహారం ఇవ్వాలని చూస్తూ ఉంటారు. ఇది మనం చేసే రెండు తప్పని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ లు రాగానే వెంటనే మందులు ఇవ్వకూడదు. చంటి పిల్లలకైనా సరే ఇలా వెంటనే మందులు ఇవ్వడం మంచి కాదు. అలాగే వారికి బలవంతంగా పాలు తాగించడానికి, ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించవద్దు. వారికి ఆకలి వేసినప్పుడు వారే ఆహారాన్ని తీసుకుంటారు. ఇలా జ్వరం వచ్చినప్పుడు పాలకు బదులుగా కాచి చల్లార్చిన నీళ్లను తాగించడానికి ప్రయత్నం చేయాలి.
చాలా మంది చంటి పిల్లలకు, చిన్న పిల్లలకు నీటిని తాగించడం మంచిది కాదని భావిస్తూ ఉంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని చంటి పిల్లలకు, చిన్న పిల్లలకు నీటిని తాగించవచ్చని నీటిని తాగించడం వల్ల శరీరంలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలు తాగని పిల్లలకు విరోచనం సులభంగా అవ్వదు. అలాంటి పిల్లలకు నీటిని తాగించడం వల్ల విరోచనం సులభంగా అవుతుంది. కనుక పిల్లలకు నీటిని తాగించడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలా జ్వరంతో బాధపడే పిల్లలకు కాచి చల్లార్చిన నీటిలో తేనె కలిపి రోజుకు 5 నుండి 6 సార్లు పట్టించాలి. ఇలా పాలు తాగించకుండా నీటిని తాగించడం వల్ల పొట్టకు ఎంతో హాయిగా ఉంటుంది. శరీరం దానంతట అదే యాంటీ బాడీస్ ను తయారు చేసుకుంటుంది.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ కు కారణమైన క్రిములను యాంటీ బాడీస్ నశింపజేస్తాయి. దీంతో 3రోజుల పాటు ఇబ్బందిపెట్టే జ్వరం కూడా ఒక్క రోజులో తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒక రోజు పాటు లంకనం పెట్టడం వల్ల పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, కఫం వంటి సమస్యల నుండి సత్వర ఫలితం కలుగుతుందని, అలాగే వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.