Methi Chicken Curry : అదిరిపోయే మేథీ చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Methi Chicken Curry : మేతీ చికెన్ క‌ర్రీ.. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. మెంతికూర‌, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. చికెన్ తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మేతీ చికెన్ కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మేతీ చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతిఆకులు – 3 క‌ట్టలు ( చిన్న‌వి), జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, క‌సూరిమెంతి – అర టీ స్పూన్,త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Methi Chicken Curry recipe make in this method
Methi Chicken Curry

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ధ‌నియాల పొడి- ఒక టీ స్పూన్, క‌రివేపాకు- ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ట‌మాట – 1, నూనె – 3 టేబుల్ స్పూన్స్.

మేతీ చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా శుభ్రంగా క‌డిగిన చికెన్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి అర‌గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మెంతి ఆకులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి క‌ల‌పాలి. చికెన్ ను మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ లోని నీరంతా పోయే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, క‌సూరిమెంతి, వేయించిన మెంతిఆకు వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్దిగా నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ ఉడికిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మేతీ చికెన్ కర్రీ త‌యార‌వుతుంది. అన్నం, చ‌పాతీ, రోటీ వంటివాటితో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts