Over Weight : ఎవరైనా సరే అధికంగా బరువు ఉంటే.. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. హైబీపీ, డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు అధికంగా వస్తాయి. కనుక అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆహారాల్లో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. అయితే అధిక బరువును వేగంగా తగ్గించుకోవాలి.. అనుకునే వారు.. కింద తెలిపిన 3 సులభమైన స్టెప్స్‌ను పాటించాలి. దీంతో బరువు వేగంగా తగ్గుతారు. మరి ఆ స్టెప్స్ ఏమిటంటే..
1. అధిక బరువు వేగంగా తగ్గాలంటే తీపి పదార్థాలను తినడం పూర్తిగా మానేయాలి. అలాగే పిండి పదార్థాలను చాలా స్వల్పంగా తీసుకోవాలి. లేదంటే ఇవి శరీరంలో కొవ్వుగా మారుతాయి. కనుక వ్యాయామం చేసినా.. బరువు తగ్గాలనుకునే ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించవు. పిండిపదార్థాలను తక్కువగా తీసుకోవడంతోపాటు ఫైబర్ అధికంగా ఉండే చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలను తీసుకోవాలి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి.
2. ప్రోటీన్లను, తాజా పండ్లను, కూరగాయలు, ఆకుకూరలను రోజూ తీసుకోవాలి. ఇవి మెటబాలిజంను పెంచి పోషణను అందిస్తాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది.
3. రోజూ వ్యాయామం చేయడంతోపాటు బరువులు ఎత్తాలి. ఇవి శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. క్యాలరీలు ఎక్కువగా కరిగేలా చేస్తాయి. దీంతో మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. ముఖ్యంగా గుండెకు చక్కని వ్యాయామం అయ్యేందుకు రన్నింగ్, జాగింగ్ వంటివి చేయాలి. తేలికపాటి బరువులు ఎత్తినా చాలు, మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువు వేగంగా తగ్గుతారు.
ఈ 3 స్టెప్స్‌ను పాటించడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు.