హెల్త్ టిప్స్

నెయిల్‌పాలిష్ వేసుకుంటున్నారా.. అయితే బరువు చెక్ చేసుకోండి!

చేతివేళ్లు ఎంత బాగున్నా నెయిల్‌పాలిష్ పెట్టందే లుక్ రాదు. ఈ పాలసీనే చాలామంది ఫాలో అవుతుంటారు. నెయిల్‌పాలిష్ చేతివేళ్లను అందాన్ని ఇవ్వడమే కాదు బరువును కూడా అమాంతం పెంచేస్తుంది అంటున్నారు నిపుణులు. దీని గురించి పూర్తి వివరాలు..

1. నెయిల్‌పాలిష్ వేసుకుంటే బరువు పెరుగుతారన్నది నిజమే. దానికి దీనికి సంబంధం ఏంటని అనుకుంటారు. ఫేమస్ డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు తిలిపిన వివరాల ప్రకారం ఎక్కువగా నెయిల్‌పాలిష్ వాడడం వల్ల అమ్మాయిలు బరువు పెరుగుతారట.

2. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనంతో నెయిల్‌పాలిష్ తయారు చేస్తారు. ఈ రసాయనం ప్లాస్టిక్, ఫామ్ ఫర్నీచర్ మంటలు అంటుకోకుండా ఉండడానికి వాడుతారు. దీన్ని నెయిల్‌పాలిష్ ఎక్కువ రోజులు మన్నేందుకు వాడుతారు. వీటిని వాడడం వల్ల మానవ హార్మోన్లపై ప్రభావం పడతాయి. దాంతో.. అమ్మాయిలు బరువు పెరుగుతారని పరిశోధకులు అంటున్నారు.

follow these tips if you get nail polish

3. మార్కెట్లో దొరికే 3 వేల రకాల నెయిల్‌పాలిష్‌లపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు. దాదాపు 49 శాతం నెయిల్‌పాలిష్‌లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంటుందని తేల్చారు. ఇలాంటి నెయిల్‌పాలిష్ పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, వీటిని పెట్టుకున్న 10-14 గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

4. అందుకే.. నెయిల్‌పాలిష్ వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకొని నెయిల్‌పాలిష్ వేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు.

Admin