అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

క్యాన్సర్ వ్యాధిని గుర్తించటం ఇక సులువే..

క్యాన్సర్ మహమ్మారి ప్ర‌తి సంవ‌త్స‌రం భారీ సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. మారిన జీవ‌న శైలి, ఆహార అల‌వాట్లు, ధూమపానం చేయడం, ఆల్కాహాల్‌ ఎక్కువగా తీసుకోవడం మొద‌లైనవి క్యాన్స‌ర్‌కు కార‌ణాలు. క్యాన్స‌ర్‌లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది. అయితే ఈ వ్యాధి బారిన పడుతున్నా వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోవటం వలన మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే త‌గిన చికిత్స‌తో భారీ మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌వ‌చ్చు.

ఈ క్ర‌మంలోనే హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆచార్యులు కంప్యూటర్ ఉపయోగించి కణజాలాన్ని విశ్లేషించటం ద్వారా కేన్సర్ వ్యాధి స్థాయిని గుర్తించే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. వీరి ప‌రిశోధ‌న‌లో దాదాపు 90 శాతం ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలు వచ్చాయి. 18 నెలల పాటు.. 1200 కణజాల నమూనాలపై పరిశోధనలు జరిపారు. వీరు కిడ్నీ కేన్సర్ బయాప్సీలకు సంబంధించిన స్లైడ్ లను డిజిటలైజ్ చేశారు. మ‌రియు వీరి పరిశోధనలు ఎక్కువగా కిడ్నీ కేన్సర్ పై జరిగాయి.

now you can identify cancer easily

ఒక ప్రత్యేకమైన టూల్ ను ఉపయోగించి టూల్ ద్వారా కణజాలం కేన్సర్ కణజాలమా ? కాదా? రోగి యొక్క జీవిత కాలం, వ్యాధి దశలను సులభంగా గుర్తించారు. సాధారణంగా మైక్రోస్కోప్ ఉపయోగించి వ్యాధిని డిజిటల్ పద్ధతిలో గుర్తించే విధానంతో పోలిస్తే ప్రత్యేకమైన టూల్ ను వినియోగించటం ద్వారా వేగంగా వ్యాధి గుర్తింపు జరిగింద‌ని అన్నారు. అలాగే 33 రకాల కేన్సర్లను ఈ విధానం ద్వారా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Admin