చాలామందికి ప్రయాణాలంటే ఇష్టం ఉన్నా బస్సు పడకపోవడంతో విరమించుకుంటుంటారు. బస్సు ఎక్కితే చాలు కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దాంతో వాంతులు అవుతాయి. దీని నుంచి బయటపడేందుకు ఇలా చేయండి.
బస్సులు ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులకు వాంతులు అవుతుంటాయి. నార్మల్‌గా కన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి. చిన్న అల్లం ముక్కను బుగ్గలోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే అల్లంతో కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటివి శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
వాంతు వస్తుందని ముందుగా తెలిసినప్పుడు వక్కపొడిని చప్పరించినా వాంతుల నుంచి బయట పడవచ్చు. నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకొని వాసన పీలిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లవంగాలు, సోంపు వంటివి దవడలో పెట్టుకొని చప్పరించినా కూడా వాంతులు రాకుండా ఉంటాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండాలంటే బస్సు అలవాటు పడాలి. అలవాటు పడాలి అంటే అలవాటు చేసుకోవాలి. బస్సు, కారులో ప్రయాణం చేసేటపుపడు ముందు సీట్లో కూర్చొని సరిసరాలను గమనిస్తూ ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.