హెల్త్ టిప్స్

జీర్ణక్రియ బాగా జరగడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు..!

సాధారణంగా కాస్త వయస్సు మీద పడిన వారిని చూసామంటె వారు అజీర్తితో బాధపడుతూ వుంటారు. వారు భుజించిన ఆహారం గొంతులోనే ఉన్న భావనతో వుంటారు. మరికొందరికి రాత్రి భుజించిన ఆహారం ఉదయము వరకు అట్లే జీర్ణంకాకుండా, రాత్రంతా చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ఈ రకమైన ఇబ్బందులను ఎదుర్కొను వారు ఈ క్రింది సూచనలను పాటించినచో అజీర్తి నుంచి ఉపశ‌మనం పొంది, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చును. ఉదయాన్నే మొదటగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కెఫన్ ఉన్న పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి.

ఉపాహారంగా నూనె లేకుండా వండిన తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే తీసుకోవాలి. ఇది రోజువారీ పనులను ఉల్లాసంగా చేయడానికి పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడిపాలలో కొద్దిగా శొంఠిపొడి, ఏలకుల పొడి వేసుకొని తాగాలి. ఏలకులు పిత్తాన్ని, అల్లం కఫాన్ని తొలగిస్తాయి.

follow these tips if you have indigestion

మధ్యాహ్నం రెండు గంటల లోపే గట్టి ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే వన్నీ తేలికగా జీర్ణమయ్యేవిగా ఉండాలి. రాత్రి భోజనం వీలైనంత తక్కువగా ఉండాలి. ఆహారంలో ఆకుకూరల వంటి పీచు పదార్థాలు మెండుగా ఉన్నవి తినడానికి వీలుకా నప్పుడు తొక్కతో సహా తినగలిగిన పండును తప్పని సరిగా చేర్చాలి.

Admin

Recent Posts