చిట్కాలు

కొత్తిమీర‌తో ఇలా చేస్తే గాఢంగా నిద్ర ప‌డుతుంది..!

కొత్తిమీర.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజు వాడే కొత్తిమీరతో రోగనిరోధక శక్తి కావాల్సినంత పెరుగుతుందని మీకు తెలుసా? రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ కొత్తిమీరతో ఎన్ని లాభాలు ఉన్నాయ్ అనేది ఇప్పుడు చూద్దాం. కొత్తిమీరలో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతాయి. కొత్తిమీరలో ఉండే దోడిసేనల్ అనే పదార్థము ద్వారా పేగుల్లో ఏర్పడే బ్యాక్టీరియాను, ఇన్ ఫెక్షన్ లాంటి వాటి తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలసరి సమయంలో అధిక రక్త స్రావం జరిగే వారికి కొత్తిమీర కషాయాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే రక్త స్రావం తగ్గిపోతుంది.

కొత్తిమీర రసం ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా జీలకర్రను కలిపి తాగితే విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలోని ఎముకలు దృఢంగా మారడానికి ఉపయోగపడ‌తాయి. గర్భిణీలు రోజు రెండు లేదా మూడు చెంచాల కొత్తిమీర రసంను నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పూర్తిగా నయం చేస్తుంది. కొత్తిమీర ఆకులను నమిలి మింగడం వల్ల నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పి నయమవుతాయి.

use coriander leaves in this way for good night sleep

అజీర్తితో బాధపడేవారు కొత్తిమీర రసంలో నిమ్మరసం, జీలకర్ర, కాస్త ఉప్పు కలుపుకొని తీసుకుంటే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. కామెర్లు ఉన్నవారు కొత్తిమీర రసం తీసుకుంటే చాలా వరకు కామెర్లు తగ్గుతాయి. పెరుగులో కాస్త కొత్తిమీర రసం కలుపుకొని ప్రతిరోజూ రాత్రి తాగితే మంచి నిద్ర పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Admin

Recent Posts