హెల్త్ టిప్స్

Overweight : అధిక బ‌రువు తగ్గాలంటే పాటించాల్సిన ముఖ్య‌మైన సూచ‌న‌లు..!

Overweight : అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మందికి స‌మ‌స్య‌గా మారింది. అందుకే చాలా మంది నిత్యం వ్యాయామం చేయ‌డం, జిమ్‌ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి గ‌డ‌ప‌డం, ఆహారాన్ని మితంగా తీసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తుంటారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు ఇవే కాకుండా కింద తెలిపిన ప‌లు సూచ‌న‌ల‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు నిత్యం అన్ని పోష‌కాలు అందేలా చూసుకోవాలి. కొన్ని సార్లు పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక నిత్యం త‌క్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం మాత్ర‌మే కాదు, అందులో అన్ని పోష‌కాలు ఉండేలా జాగ్ర‌త్త వ‌హించాలి. దీంతో అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

నిత్యం మ‌నం తినే ఆహారంలో రెండు ర‌కాల ప‌దార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఒక‌టి స్థూల పోష‌కాలు. రెండోది సూక్ష్మ పోష‌కాలు. పిండి ప‌దార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు స్థూల పోష‌కాల జాబితా కింద‌కు చెందుతాయి. విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఇత‌ర పోష‌కాలు సూక్ష్మ పోష‌కాల జాబితా కింద‌కు వ‌స్తాయి. స్థూల పోష‌కాల‌ను నిత్యం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ముఖ్యంగా మ‌నం తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండాలి. త‌రువాత పిండి ప‌దార్థాల‌ను తినాలి. కొద్ది మొత్తంలో కొవ్వు ప‌దార్థాల‌ను తీసుకోవాలి. దీంతో శ‌రీరానికి అన్ని ర‌కాల ప‌దార్థాలు అందుతాయి. ఫ‌లితంగా మెట‌బాలిజం మెరుగు ప‌డి కొవ్వు క‌రిగేందుకు, అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

follow these wonderful health to reduce weight

నిత్యం మ‌నం తినే ఆహారంలో ఫైబ‌ర్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఫైబ‌ర్ వ‌ల్ల ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. పైగా ఆహారం కూడా త‌క్కువ‌గా తీసుకుంటారు. దీంతో శ‌రీరానికి అందే క్యాల‌రీల సంఖ్య త‌గ్గుతుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, ప్యాక్ చేయ‌బ‌డిన ప‌దార్థాలు, చ‌క్కెర‌, కొవ్వులు, ఉప్పు ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాలు, ఇత‌ర జంక్ ఫుడ్‌ల‌ను తిన‌డం మానేయాలి. ఇవి బ‌రువును త‌గ్గించ‌క‌పోగా అధిక బ‌రువును పెంచేందుకు తోడ్పడుతాయి. క‌నుక వీటిని పూర్తిగా మానేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువు పెరుగుతారు. క‌నుక వీటిని మానేస్తే అధిక బ‌రువు త‌గ్గుతారు.

Admin

Recent Posts