Sleeplessness Home Remedies : చాలామందికి, రాత్రి పూట నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడంతో, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. సరైన నిద్ర లేకపోతే అది ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది కూడా. ఉదయం నుండి సాయంత్రం వరకు, పనులు చేసుకోవడం, రాత్రి అయితే హాయిగా నిద్రపోవడం, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యము. ఉదయం ఎంత పని చేసుకున్నా, రాత్రి ఫుల్లుగా నిద్రపోతేనే ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి నిద్రలేమికి ముఖ్య కారణం అని తెలుసుకోండి. నిద్రలేమీ ఎన్నో శారీరిక, మానసిక సమస్యల్ని తీసుకువస్తుంది. శరీరం సక్రమంగా పని చేయాలంటే, రోజుకి కనీసం ఏడు లేదా ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్ర పోవాలి.
తగినంత నిద్ర రాకపోవడం వలన శారీరకంగా, మానసికంగా అలసిపోతూ ఉంటారు. బలహీనంగా కూడా ఉంటారు. ఏకాగ్రత కూడా తగ్గుతుంది. పనిమీద ఆసక్తి కూడా ఉండదు. నిద్రలేమి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్రపోవడానికి ముందు అరటిపండు, గుమ్మడికాయ విత్తనాలు లేదంటే బాదం, చామంతి టీ ని తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇవి మనకి సహాయం చేస్తాయి.
రోజులో గుప్పెడు గింజలు తీసుకుంటే కూడా రాత్రుళ్ళు బాగా నిద్ర పడుతుందట. హాయిగా నిద్ర పోవాలంటే, తినడానికి, పడుకోవడానికి మధ్య గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే ప్రశాంతంగా నిద్రపోవడానికి అవుతుంది. రాత్రి పూట నిద్రపోవడానికి రెండు గంటల ముందు భోజనం చేసేయాలి. రోజు వ్యాయామం చేస్తే కూడా బాగా నిద్ర పడుతుంది. ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసులు నీళ్లు తాగడం కూడా అవసరం.
పోషకాహార లోపం ఉంటే కూడా, నిద్రకి ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా విటమిన్ డి, బీ12 సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే, నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇలా, మీరు కనుక వీటిని పాటించినట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. హాయిగా ఆరోగ్యంగా ఉండవచ్చు.