Fruit Juices For Weight Loss : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు సమస్యతో సతమతం అవుతున్నారు. అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ కారణంగా చాలా మంది బరువు పెరుగుతుంటారు. అలాగే ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి, రోజూ గంటల తరబడి కూర్చుని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం.. వంటివన్నీ అధిక బరువు పెరిగేందుకు కారణాలుగా చెప్పవచ్చు. అధికంగా బరువు ఉన్నవారు రోజూ ఆహారంలో విషయంలో జాగ్రత్తలను పాటించాలి. అలాగే వ్యాయామం చేయాలి. దీంతో బరువు తగ్గుతారు. అలాగే కింద చెప్పిన జ్యూస్‌లలో ఏదో ఒక దాన్ని రోజూ పరగడుపునే తాగినా చాలు.. దాంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా అధిక బరువు సులభంగా తగ్గుతారు. ఇక బరువును తగ్గించే ఆ జ్యూస్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు తగ్గేందుకు టమాటా జ్యూస్ ఎంతగానో దోహదపడుతుంది. దీన్ని ఉదయం పరగడుపునే ఒక కప్పు మోతాదులో తాగాలి. టమాటా సూప్‌ను తాగినా ఫలితం ఉంటుంది. టమాటాలలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక పరగడుపునే టమాటా జ్యూస్‌ను తాగితే కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు. ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక దీంతోపాటు పైనాపిల్ జ్యూస్‌ను కూడా తాగవచ్చు.
పైనాపిల్‌లో బ్రొమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో శరీరంలో కొవ్వు పేరుకోదు. ఫలితంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు రోజూ పైనాపిల్ జ్యూస్‌ను తాగాలి. అలాగే దానిమ్మ రసం కూడా బరువును తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరిచి రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. గుండెను సంరక్షిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కనుక బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ దానిమ్మ పండ్ల రసాన్ని కూడా తాగవచ్చు. దీన్ని కూడా రోజూ ఒక కప్పు మోతాదులో తీసుకుంటే చాలు. ఫలితం కనిపిస్తుంది.
ఇక యాపిల్ పండ్ల జ్యూస్‌ను తాగినా కూడా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు పాలకూర జ్యూస్ కూడా ఉత్తమంగా పనిచేస్తుంది. ఇవన్నీ బరువును తగ్గించడంతోపాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అలాగే శరీరానికి శక్తితోపాటు పోషకాలను కూడా అందిస్తాయి. కనుక వీటిల్లో ఏదైనా ఒక జ్యూస్‌ను రోజూ తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.