Gasagasalu Milk : పాలల్లో 3 రోజుల పాటు ఇది కలుపుకుని తాగితే చాలు వృద్ధాప్యం మన దరి చేరకుండా ఉంటుంది. శరీరంలో నీరసం, నిస్సత్తువ, అలసట వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో డయాబెటిస్ సమస్య రాకుండా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గు ముఖం పడుతుంది. అదేవిధంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దీనిని తాగడం వల్ల ఎముకలు ధృడంగా మారుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం గసగసాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
గసగసాలు మనందరికి మసాలా దినుసులుగానే తెలుసు. కానీ వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా వీటిని అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. గసగసాల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. గసగసాలను ప్రతిరోజూ తగిన మోతాదులో తీసుకుంటే మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గసగసాలను ఏవిధంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గసగసాలను మనం మూడు రకాలుగా తీసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను వేసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ గసగసాలను వేసి 3 పొంగులు వచ్చే వరకు మరిగించాలి.
తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత దీనిలో రుచికి తగినంత బెల్లం లేదా పటిక బెల్లాన్ని వేసుకుని రోజూ రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా గసగసాల్లో ఉండే పోషకాలను మనం పొందవచ్చు. పాలను తాగలేని వారు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ గసగసాలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగి గసగసాలను తినాలి. ఇలా చేసిన కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఇలా రాత్రంతా నానబెట్టిన గసగసాలను ఉదయాన్నే పాలల్లో వేసి మరిగించి కూడా తీసుకోవచ్చు.
గసగసాలను ఈ మూడు పద్దతుల్లో ఏ విధంగా తీసుకున్నాకూడా మనం మంచి ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా గసగసాలను తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. కడుపులో అల్సర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. అధిక దాహం సమస్య కూడా తగ్గుతుంది. అలాగే గసగసాలను తీసుకోవడం వల్ల పిత, కఫ, వాత దోషాలు తొలగిపోతాయి. గసగసాలను ఇలా పాలల్లో మరిగించి తీసుకోవడం వల్ల మేహ జ్వరాలు, వాంతులు, విరోచనాలు తగ్గు ముఖం పడతాయి. ఫైల్స్ సమస్యతో బాధపడే వారు గసగసాలను ఇలా పాలతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దగ్గు, ఉబ్బసం, క్షయ, షుగర్ వంటి వాధ్యులతో బాధపడే వారు ఈ గసగసాలను తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి బయటపడవచ్చు. గసగసాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
గుండె సమస్యలతో బాధపడే వారు రోజుకు రెండు పూటలా వేయించిన గసగసాలను రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల గుంగె బలంగా తయారవుతుంది. మానసిక సమస్యలతో భాదపడే వారు అధిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడే వారు గసగసాలను పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఈ విధంగా గసగసాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వాటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.