హెల్త్ టిప్స్

Gond Katira In Telugu : ఇది ఏంటో మీకు తెలుసా.. దీంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Gond Katira In Telugu : చాలామందికి అసలు ఈ బాదం జిగురు గురించి తెలియదు. బాదం జిగురు ఒక మంచి ఔషధ మూలిక అని చెప్పవచ్చు. బాదం జిగురు గురించి ఈ కాలం వాళ్లకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ, పూర్వీకులు బాదం జిగురు ఎక్కువగా వాడేవారు. దీన్నే గోండ్ క‌టీరా అని కూడా అంటారు. బాదం జిగురు వలన అనేక రకాల లాభాలను పొందడానికి అవుతుంది. ఎండాకాలంలో బాదం జిగురుని తీసుకుంటే, ఒళ్ళు చల్లబడుతుంది. దగ్గు మొదలైన సమస్యల్ని కూడా బాదం జిగురు తొలగిస్తుంది. బాదం చిగురుని ఉపయోగించడం వలన, ఎటువంటి లాభాలను పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

ఎండాకాలంలో, వడదెబ్బ బాగా తగులుతూ ఉంటుంది. ఒంట్లో విపరీతమైన వేడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. బాదం జిగురుని తీసుకుంటే, కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను ఇది బాగా తగ్గిస్తుంది. డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు బాదం జిగురు తో దూరం అవుతాయి. బాదం జిగురు ని తీసుకుంటే, రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.

gond katira amazing benefits

డెలివరీ తర్వాత చాలామంది తల్లులు, సామర్థ్యాన్ని పొందాలని అనుకుంటుంటారు. బాదం జిగురుతో తయారు చేసిన లడ్డులు ని తీసుకోవడం వలన, పాల ఉత్పత్తి పెరగడంతో పాటుగా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పలు రకాల సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు. బాదం జిగురుతో కేర్ వంటివి కూడా సులభంగా మనం తయారు చేసుకోవచ్చు. బాదం జిగురు, నిమ్మరసం తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు.

ఈ బాదం జిగురుతో, మనం డ్రింకులు వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. బాదం జిగురు తో తయారు చేసిన మిల్క్ షేక్ వంటి వాటిని పిల్లలకి కూడా ఇవ్వచ్చు. పిల్లలు కచ్చితంగా ఇష్టపడి తీసుకుంటూ ఉంటారు. ఒక గ్లాసు చల్లని పాలు తీసుకుని, రెండు టేబుల్ స్పూన్లు బాదం జిగురు, ఒక టేబుల్ స్పూన్ రోజు సిరప్ వేసి, కొంచెం పంచదార వేసి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Admin

Recent Posts